నారాయణ ధైర్యమే ధైర్యం..

0
645
minister narayana really dare person..

   minister narayana really dare person..  చెట్టంత కొడుకు కుప్పకూలిన తర్వాత నిబ్బరంగా ఉండటం మహామహులకే సాధ్యం కాని పని. రాజకీయాల్లో నిత్యం వ్యూహప్రతివ్యూహాలు తో గడిపేవాళ్లు,సరిహద్దుల్లో సైనికులుగా దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టగలిగిన వాళ్ళు సైతం కొడుకుని పోగొట్టుకున్న దుఃఖాన్ని దిగమిండలేరు. కానీ మంత్రి నారాయణ మాత్రం కొడుకు నిషిత్ ప్రమాదంలో చనిపోయాక కూడా ఏ మాత్రం చెదిరిపోలేదు. కొడుకు మరణవార్త తెలుసుకుని లండన్ నుంచి చెన్నై,అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకున్నారు.కొడుకు మృతదేహాన్ని చూసి మౌనంగా ఓ పావుగంట,ఇరవై నిమిషాలు గడిపారు.ఆ తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు.మన చేతుల్లో లేనిది జరిగిపోయింది. అని వారికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించారు.ఇక నారాయణ విద్యాసంస్థల ప్రతినిధులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నారాయణే స్వయంగా వారికి ధైర్యం చెప్పడం,ఓదార్చడం కనిపించింది.

             ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా అంత నిబ్బరంగా వ్యవహరించడం నారాయణకు మాత్రమే సాధ్యమేమో.ఉక్కు మహిళగా దేశం భావించిన ఇందిరా గాంధీ సైతం తనయుడు సంజయ్ గాంధీ ని కోల్పోయినప్పుడు తీవ్ర విచారానికి లోనయ్యారు.ఇక మన కళ్ళ ముందే ఎందరో సెలెబ్రెటీలు పుత్రశోకం తో కుమిలికుమిలి ఏడవడం చూసాం.కానీ అదేమీ లేకుండానే జరిగిన పెద్ద విషాదాన్ని ఇంత సంయమనంతో,స్థిత ప్రజ్ఞతతో స్వీకరించడం నారాయణకు మాత్రమే చెల్లింది.బహుశా ఈ శక్తిసామర్ధ్యాల వల్లే  ఏ మాత్రం సంబంధం లేని రాజకీయాల్లో సైతం ఆయన రాణించగలుగుతున్నారు .

Leave a Reply