మంత్రుల‌కు దొర‌క‌ని చిన్న‌మ్మ ద‌ర్శ‌నం!!!

0
291
ministers are not allowed to meet seshikala

Posted [relativedate]

ministers are not allowed to meet seshikala
ప‌ళ‌నిస్వామి కేబినెట్ స‌హ‌చ‌రుల‌కు చిన్న‌మ్మ ద‌ర్శ‌నం దొర‌క‌లేదు. శ‌శిక‌ళ‌ను క‌ల‌సి ఆమె ఆశీస్సులు తీసుకుందామంటే వారికి మొండిచేయే మిగిలింది. చిన్న‌మ్మ ద‌ర్శ‌నం క‌ల‌గ‌క‌పోగా.. మూడు గంట‌ల పాటు వెయిట్ చేసి అల‌సిపోయారు త‌మిళ‌నాడు మినిస్ట‌ర్లు.

ప‌ళ‌నిస్వామి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న శ్రీనివాసన్, సెంగొట్ట‌య‌న్, సెల్లూర్ రాజులు… చిన్న‌మ్మ‌ను క‌లిసేందుకు చెన్నై నుంచి బెంగళూరు వ‌చ్చారు. అక్క‌డి సెంట్ర‌ల్ జైలుకు వెళ్లారు. శ‌శిక‌ళ కోసం మూడు గంట‌ల‌పాటు ప‌డిగాపులు కాశారు. చివ‌ర‌కు అధికారులు వారికి చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం జైలులో ఉన్న ఖైదీని కలిసేందుకు వారానికి రెండు రోజులు మాత్రమే అవకాశమిస్తారు. శ‌శిక‌ళ జైలుకు వెళ్లి వారం రోజులైంది. అప్ప‌టినుంచి ఆమెను ప‌లువురు నాయ‌కులు క‌లిశారు. దిన‌క‌ర‌న్ తో పాటు ఇత‌ర ముఖ్య నాయ‌కులు ఆమెతో ములాఖ‌త్ అయ్యారు. దీంతో ఈ వారానికి చిన్న‌మ్మ కోటా పూర్త‌య్యింది. ఆమెను క‌ల‌వాటంటే మ‌రో వారం రోజులు ఆగ‌క‌త‌ప్ప‌దు.

మూడు గంట‌ల పాటు వెయిట్ చేసిన త‌ర్వాత జైలు అధికారులు ఈ విష‌యం చెప్ప‌డంతో త‌మిళ‌నాడు మంత్రులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. చిన్న‌మ్మ ద‌ర్శ‌నం చేసుకొని .. మార్కులు కొట్టేద్దామ‌నుకుంటే.. ఇలా జ‌రిగిందేంట‌ని నిరాశ‌తో చెన్నైబాట ప‌ట్టారు. అయినా చిన్న‌మ్మ‌ ద‌ర్శ‌నం చేసుకోవాలంటే… ఆ మాత్రం వెయిటింగ్ త‌ప్ప‌దంటున్నారు అన్నాడీఎంకే శ్రేణులు.

Leave a Reply