ఆ ప్రకాశం పై పొరబడ్డాం..మన్నించండి ..

mistaken prakasam sorry
మిరుమిట్లు గొలిపే వెలుగులు ఒక్కసారిగా కళ్ళెదురుగా ప్రత్యక్షమైతే ఆ ప్రకాశాన్ని తట్టుకోలేక రెప్ప కొట్టేస్తాం. ఆ రెప్ప పాటు కాలంలో ఏమి జరుగుతుందో ప్రకాశం బ్యారేజ్ ఫోటోలంటూ మీడియానెట్ వర్క్ లోకి వచ్చిపడ్డ రంగురంగుల చిత్రాలు చెప్పేశాయి. ఇది కావాలని ఎవరైనా చేసి ఉండొచ్చు. ప్రభుత్వ వర్గాలు, మీడియా, సరదాకి చేసే వాళ్ళు… ఇలా ఎవరివల్లనైనా ఇది జరిగి ఉండొచ్చు.. అది పొరపాటున జరిగిందా? లేక ఉద్దేశపూర్వకమా అన్నది తేలాల్సివుంది. తప్పు, పొరపాటు ఎవరిదైనా పప్పులో కాలేసినవాళ్లలో తెలుగుబుల్లెట్ కూడా వుంది. జరిగిన దానికి ఎవరి మీదో నెపం వేసే ఉద్దేశం మాకు లేదు. మనస్ఫూర్తిగా మా తప్పు ఒప్పుకుంటూ క్షమాపణ కోరుతున్నాము. మున్ముందు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని మాట ఇస్తున్నాం. దాన్ని నిలబెట్టుకుని మీ విశ్వాసాన్ని కాపాడుకొంటాం ..

ఇంతకీ ప్రకాశం బ్యారేజ్ ఫోటోలంటూ నెట్లో హల్ చల్ చేసినవి సౌత్ కొరియా లోని బంపో బ్రిడ్జి ఫోటోలు.. జనం మూడ్ చూసి వాటిని తెలుగు జనాల మీదకి వదిలారు. ఏమైనా జరిగిన పొరపాటుని ఒప్పుకుంటూ మరోసారి నెటిజెన్లను మన్నింపు కోరుతున్నాం

SHARE