ఆ పొగడ్త,ఈ ఆశ తో ఆమె జగన్ ని వేటాడుతోంది..

0
308
mla anitha fires on jagan about mogalturu incident

Posted [relativedate]

mla anitha fires on jagan about mogalturu incident
“నువ్వు నాపై రాళ్లు విసిరితే వాటితో నా చుట్టూ గోడ కట్టుకుంటా “… అని దర్శకుడు శ్రీను వైట్ల తో గొడవ వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ లో చెప్పిన డైలాగ్ ఇది.ఇప్పుడు ఇదే డైలాగు టీడీపీ కి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేకి అచ్చు గుద్దినట్టు సరిపోతోంది.ఆమె పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత.వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఆమె గురించి నోరు పారేసుకుంది మొదలు అనిత రాజకీయంగా ఎదుగుతూనే వుంది.రోజాని కార్నర్ చేసే క్రమంలో అనిత ని బాబు ఎంకరేజ్ చేశారు.ఆ ఆసరాతో అసెంబ్లీ బయటా,లోపలా ఆమె దూకుడుగా పనిచేస్తున్నారు.అనిత మాట తీరుకి చంద్రబాబు తాజాగా కూడా పొగడ్తలు కురిపించారు.ఆ పొగడ్త తో పాటు పీతల సుజాత స్థానంలో క్యాబినెట్ హోదా దక్కొచ్చన్న వార్తలు కూడా వస్తున్నాయి.ఆ పొగడ్త,ఈ ఆశ కలిసి అనిత లో కొత్త ఉత్సాహం వచ్చేసింది.అదే జోరులో ఆమె వైసీపీ అధినేత జగన్ ని వేటాడుతున్నారు.

మొగల్తూరు ప్రమాద ఘటనపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడిన తీరు చూస్తే జగన్ ని వేటాడడానికి అనిత ఏ రేంజ్ లో ప్రిపేర్ అయ్యారో అర్ధం అవుతుంది.ఇంతకీ ఆమె ఏమి మాట్లాడారంటే.. ” • మొగల్తూరు ఘటన దురదృష్టకరం. ఐదుగురు చనిపోయారు. ఈ విషయం తెలిసినవెంటనే ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకొనని వారిని ఓదార్చి… బాధితులకు రూ. 25 లక్షల పరిహారం ఇచ్చాం. జగన్ గారు అధికారం కోసం ఎప్పుడూ ఏదోవిధంగా సభను ఆపాలనుకుంటున్నారు. దీని కోసం వాయిదా తీర్మానం ఇస్తున్నారు. కొశ్చన్ అవర్ మా హక్కు.

• ఆయనకు రూల్స్ రెగ్యులేషన్ తెలియవు. మీరొక్కడే మాట్లాడితే సరిపోతుందా… ప్రతీసారి రభస చేస్తున్నాడు. భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో 2008లో పై కప్పు కూలి వ్యక్తి చనిపోయి, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడు చెవిరెడ్డి 108 వాహనాన్ని కూడా రాకుండా చెవిరెడ్డి అడ్డుకున్నాడు.

• రాంకీ సిమెంట్ ఫ్యాక్టరీల్లో ఎన్నో సంఘటనలు జరిగాయ్. ఆనాడు ఎందుకు నోరు విప్పలేదు. ఆ రోజు ఎందుకు పరిహారం ఇవ్వాలని అడగలేదు. అప్పుడు స్పందించని వ్యక్తి ఇప్పుడు ఎందు అడుగుతున్నారు. ఇతను బ్లాక్ మెయిలర్.

• ఇతనికి ఒక్కటే ఏపీకి పరిశ్రమలు రాకుంటే… ఉద్యోగాలు రావని… యువత బాధపడి… టీడీపీకి ఓట్లేయరని అప్పుడు జగన్ గెలుస్తాడని కోరికతోటి ఇలా చేస్తున్నాడు.

• అలాగే హెచ్.పి.సి.ఎల్ ఘనటలో ముగ్గురు చనిపోయారు. అప్పుడెందుకు మీ తండ్రితోటి చెప్పలేదు. వారందరికీ పరిహారం ఇవ్వాలని ఎందుకు అడగలేదు. అప్పుడు ఆ కంపెనీ ఎందుకు మూయలేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆక్వా రైతులు జగన్ ను రానీవ్వడం లేదు. జగన్ కు రెండే రెండు కళ్లు… ఒకటి బ్లాక్ మనీ రెండు బ్లాక్ మెయిల్

• సభ్యులకు ఇష్టం లేకపోయినా రాద్ధాంతం చేస్తున్నారు. వైస్సార్ హయాంలో అనేక సంఘటనలు జరిగాయ్. ఇలాంటి ఘటనలు జరిగినంత మాత్రాన… సంస్థలు మూసేస్తారా… “

అనిత దూకుడు ఇప్పుడే ఇలా ఉంటే ఇక క్యాబినెట్ హోదా వస్తే ఏ రేంజ్ లో ఉతికి ఆరేస్తుందో ?

Leave a Reply