ఎమ్మెల్యేకి అల్లుడవుతున్న ఆ యువ ఎంపీ ..

Posted December 20, 2016

kinjarapu ram mohan naidu marriage with pendurthi mla bandaru satyanarayana daughter
కింజారపు రామ్మోహన్ నాయుడు …యువ ఎంపీగా టీడీపీ శ్రేణుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న అయన త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు.ఓ ఎమ్మెల్యే కుమార్తెను అయన వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తె శ్రావ్యతో రామ్మోహన్ నాయుడు వివాహం జరగబోతోంది.సత్యనారాయణ మూర్తి కుమారుడు అప్పలనాయుడు తో స్నేహంగా వుండే ఎంపీ ఆ క్రమంలోనే ఆ ఇంటితో బంధుత్వానికి మొగ్గు చూపినట్టు తెలిసింది.ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య పెళ్లి మాటలు నడిచాయట.మెడిసిన్ చేస్తున్న పెళ్లి శ్రావ్య ఓకే అనడంతో ఎంపీ గారు పెళ్ళికొడుకు కాబోతున్నారు .

దివంగత కింజారపు ఎర్రన్నాయుడు కి టీడీపీ అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయన కుమార్తెని కూడా అప్పట్లో టీడీపీ నేతగా ఉన్న రాజముండ్రి కి చెందిన ఆదిరెడ్డి అప్పారావు కుమారుడికి ఇచ్చి పెళ్ళిచేసారు.ఇక ఇప్పుడు అయన కుమారుడు కూడా అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమార్తెని వివాహం చేసుకోబోవడం విశేషం.సహజంగా బంధుత్వం విషయానికి వచ్చేసరికి పార్టీలని పెద్దగా పట్టించుకునే రోజులు కావివి.అయినా ఎర్రన్నాయుడు కుటుంబం మాత్రం పార్టీ నేతలతోనే బంధుత్వం కలుపుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

SHARE