జారుకుంటున్న ఎమ్మెల్యేలు!!

0
225
mlas are decreasing in party

Posted [relativedate]

mlas are decreasing in party
నిన్నటిదాకా శశికళ మాటను తూచా తప్పకుండా పాటించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. ఇప్పుడు రూటు మార్చారు. చిన్నమ్మకు జైలు శిక్ష పడడంతో.. ఇక లాభం లేదనుకున్నారో ఏమో.. ఆమెను లైట్ తీసుకుంటున్నారు. అందుకే గోల్డెన్ బే రిసార్డు నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు జారుకుంటున్నారు.

నిజానికి నిన్నటిదాకా రిసార్టులో 119 మంది ఉన్నారని శశికళ వర్గం బీరాలు పలికింది. కానీ ఆ సంఖ్య ఇప్పుడు 90 లోపే ఉందట. మంగళవారం రాత్రి చాలా మంది ఎమ్మెల్యేలు ఇళ్లకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఆరోగ్య కారణాలు చూపి వెళ్లిపోయిన ఆ ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఫోన్ స్విచ్ఛాప్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇక మరికొంతమంది ఎమ్మెల్యేలు రిసార్టు సిబ్బంది కళ్లు గప్పి గోడ దూకి పారిపోయారట. అంతేకాదు రిసార్టులో ఉన్న మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్లిపోతామని గోల చేస్తున్నారని టాక్. శశికళ వర్గం నిన్నటిదాకా నయానో భయానో పరిస్థితిని నెట్టుకొచ్చింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం కష్టమమే వాదన వినిపిస్తోంది.

అటు పళనిస్వామి ఏమో గవర్నర్ ను కలిసి.. తమకు సంపూర్ణ మద్దతు ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి అంత సాఫీగా ఏం లేదు. తీర్పు వచ్చినప్పటి నుంచి పన్నీర్ సెల్వం వేగం పెంచారట. నిన్న రాత్రి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలందరినీ సెల్వం వర్గం క్యాచ్ చేసిందట. వారిలో రాత్రి నుంచే టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అలా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలను సెల్వం వర్గం తమ ఆధీనంలోకి తెచ్చుకుందని సమాచారం. ఏదేమైనా పళనిస్వామికి షాకిచ్చేందుకు పన్నీర్ గట్టి ప్లాన్ వేశారట.

Leave a Reply