ఆకుచాటు పిందె తడిపిన ఎమ్మెల్యే వియ్యంకులు..

0
245
mlas dancing in children wedding

Posted [relativedate]

mlas dancing in children wedding
వాళ్లిద్దరూ తొలుత ఆంధ్రప్రదేశ్ కి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు..ఆపై స్నేహితులు …ఈ మధ్యే ఫిబ్రవరి పదిహేను గుంటూరు లో జరిగిన పెళ్లితో వియ్యంకులు కూడా అయ్యారు.వాళ్ళు మరెవరో కాదు పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్,వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు.ఈ ఇద్దరూ రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా అందరికీ తెలుసు.అయితే వారిలో వున్న డాన్సర్స్ కూడా బయటికి వచ్చారు.తమ బిడ్డల వివాహం ముందు హైదరాబాద్ జలవిహార్ లో ఏర్పాటు చేసిన మెహందీ ఫంక్షన్ లో ఆ ఎమ్మెల్యేలు ఇద్దరూ రెచ్చిపోయారు.ఆకుచాటు పిందె తడిచే అనే ఎన్టీఆర్ పాటకి స్టెప్ లు వేసి బంధువులు,అతిథుల్ని అలరించారు.ఈ పాటకి ఎమ్మెల్యేల స్టెప్స్ చూసి నవ్వులపువ్వులు పూచాయి.అయితే స్టెప్స్ విషయంలో కొమ్మాలపాటి కన్నా ఆంజనేయులు బెటర్ అనిపించారు.ఏదేమైనా మెహందీ అనే ఉత్తరాది సంస్కృతి పెద్ద ఇళ్ల పెళ్లిళ్లలో ఓ భాగం అవ్వడం ఓ ఎత్తు అయితే …ఇలాంటి సరదా సీన్స్ కి ఆ వేడుకలు వేదికగా నిలవడం ఇంకో ఎత్తు. సీరియస్ గానో ..ఇంకో విధంగానో కనిపించే పెద్దమనుషులంతా పిల్లల పెళ్లిళ్లలో తాము కూడా పిల్లలై ఆ వేడుకల్ని ఇంతగా ఆస్వాదించడం సరికొత్త పరిణామం.

            

Leave a Reply