ఆ చట్టానికి అడ్డుపడుతున్న ఎమ్మెల్సీ..

 Posted October 23, 2016

mlc defends rti act
పాలనలో పారదర్శకత పెంచడానికి సమాచార చట్టాన్ని విరివిగా వాడుకోమని ప్రభుత్వాలు చెబుతున్నాయి..కానీ ఆ చట్టాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ ఓ చట్టసభ సభ్యుడే విలేకర్లని ఎదురు ప్రశ్నిస్తున్నారు.అందులో తప్పేముందని ఆ విలేకరి జవాబిస్తే సదరు ఎమ్మెల్సీ ఆగ్రహం కట్టలు తెంచుకొంది.

అయన బూతుపురాణం లంకించుకుని అప్పటికి ఆ విలేకరి నోరు మూయించగలిగాడు.అయితే జర్నలిస్ట్ తెలివిగా ఆ ఎమ్మెల్సీ తిట్ల భాగోతాన్ని రికార్డు చేసాడు.వాట్స్ అప్ ద్వారా దాన్ని ప్రపంచం ముందుకు తెచ్చాడు.దీంతో నోరుపారేసుకున్న ఆ ఎమ్మెల్సీ ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో అని కంగారు పడుతున్నాడు.

ఇదంతా గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది.ముఖ్యమంత్రి చంద్రబాబు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన్నన పొందిన ఆ ఎమ్మెల్సీ ఓ ఛానల్ ప్రతినిధిపై చేసిన భాషా ప్రయోగం విని స్థానికులు వామ్మో ఇదేమి ప్రవర్తన అని అనుకుంటున్నారు.చట్టాలు చేసే సభ్యులే ఆ చట్టాల్ని కాలరాయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసాక బాబు గారు ఎలా స్పందిస్తారో చూడాలి.

SHARE