ఇంటర్నెట్ లేకుండా మొబైల్ బ్యాంకింగ్ సేవలు

0
359
ussd-banking

Posted [relativedate]

Image result for mobile banking without internet

స్మార్ట్ ఫోన్ లేక పోయినా ఇంటర్నెట్ లేక పోయినా బ్యాంకింగ్ సేవలను పొందే అవకాశం వుంది .అదెలా అంటే ఇదిగో ఇలా సాధారణ మొబైల్‌ఫోన్ యూజర్లకు కూడా యుఎస్ఎస్‌డిల (అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డివైస్) ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసు అందుబాటులో ఉంది.ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి తెలుగుకోసం *99*24#కు డయల్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే వెల్‌కమ్ స్ర్కీన్‌లో మూడు అక్షరాలతో కూడిన బ్యాంక్ షార్ట్ నేమ్ కాని, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌కు సంబంధించి మొదటి నాలుగు అక్షరాలు గాని, రెండు డిజిట్ల బ్యాంక్ న్యూమరిక్ కోడ్‌ను గాని ఎంటర్ చేసి ‘సెండ్’ బటన్ పై క్లిక్ చేయాలి.
అనంతరం మొబైల్ నెంబర్ , బ్యాంక్ అకౌంట్ వివరాలు వెరిఫై కాబడి ఓ ప్రత్యేకమైన సబ్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోవటం, మినీ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవటం, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు ఒకటి (1) ని, మినీ స్టేట్‌మెంట్‌ను పొందేందుకు 2 ను ఎంటర్ చేయాలి. అయితే నగదు ట్రాన్స్ ఫర్ కు మాత్రం ఎంఎంఐడీ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
వివిధ భాషల్లో ( యుఎస్ఎస్ డీ) ఇలా పొందొచ్చు .

తమిళం కోసం (*99*23#), హిందీ కోసం (*99*22#), మరాఠీ కోసం (*99*28#), బెంగాలీ కోసం (*99*29#), పంజాబీ కోసం (*99*30#), కన్నడ కోసం (*99*26#), గుజరాతీ కోసం (*99*27#), మళయాళం కోసం (*99*25#), ఒరియా కోసం (*99*32#), అస్సామీస్ కోసం (*99*31#)

Leave a Reply