అంతా కేసీఆరే చేశారు!!

0
313
4946_modi_kcr

Posted [relativedate]

Related image

పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ మొదటివరుసలో ఉంటారు. ఈమధ్య ఆయన మోడీకి తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అటు పీఎం నుంచి కూడా ఆయన పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. దీంతో కేసీఆర్ ఒక్క మాట అంటే.. దాన్నే మోడీ ఫాలో అయిపోతారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.

బ్లాక్ మనీ విషయంలో ప్రజలను టార్గెట్ చేయడం కాదు.. రాజకీయ నాయకులు కూడా వారి ఆస్తుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమైన సూచన చేశారు కేసీఆర్. ఇది మోడీని బాగా అట్రాక్ట్ చేసినట్టుంది. వెంటనే దాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇంకేముంది ముందు బీజేపీ నుంచి దాన్ని మొదలు పెడదాం అన్న ఆలోచన వచ్చేసింది మోడీకి. జీహుజూర్ అంటూ పార్టీ చీఫ్ అమిత్ షా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 లోపు బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాలని సూచించారు.

అమిత్ షా ఆదేశాలతో బీజేపీ నాయకులు షాక్ అయిపోయారట. ఇదంతా కేసీఆర్ పుణ్యమేనని సెటైర్లు వేస్తున్నారట. అంతా కేసీఆరే చేశారంటూ మండిపోతున్నారట బీజేపీ లీడర్స్. ఏదేమైనా కేసీఆర్ ఒక సూచన చేయడం.. దాన్ని మోడీ, అమిత్ షా ఫాలో కావడమేంటని నిలదీస్తున్నారట పార్టీ లీడర్స్. అయితే సూచన ఎవరిస్తే ఏముంది? అది మంచిదా? కాదా? అన్నదే పాయింట్ అంటున్నారు బీజేపీ అగ్రనేతలు.

Leave a Reply