Saturday, September 18, 2021
Homelatestబీజేపీ అంతే... ఊరించి ఉసూరుమనిపిస్తుంది

బీజేపీ అంతే… ఊరించి ఉసూరుమనిపిస్తుంది

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఏపీకి వరుస కట్టి నిధులొస్తాయని అధికార టీడీపీ సహా జనం కూడా భావించారు. మోడీ మాట తప్పని మహానుభావుడని నమ్మారు. కానీ చివరకు మిగిలిందేంటి..? హోదా సంగతి పక్కనపెడితే ప్యాకేజీ నిధులు కూడా సమక్రంగా రావడం లేదు. మాట్లాడితే లెక్కలు చెప్పాలంటూ రాష్ట్రాల్ని దొంగల్లా చూస్తోంది కేంద్రం. మరి కేంద్రం పెట్టే అనవసర ఖర్చుల సంగతేంటనే ప్రశ్నకు బీజేపీ దగ్గర సమాధానం లేదు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రధానీ పెట్టని విధంగా విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు ప్రధాని మోడీ.

పనికిమాలిన విదేశీ టూర్లు, వార్డు ఎన్నికలనూ పొలిటికల్ కోణంలో చూసి ప్రధానే వెళ్లి ప్రచారం చేసే సీన్లు.. ఇంతవరకూ దేశప్రజలు కలలో కూడా ఊహించనివి. మోడీకి ప్రధాని పదవి ఇచ్చినా… ఆ స్థాయి రాలేదని, ఇంకా గల్లీ లీడర్ లా వ్యవహరిస్తున్నారనేది కాదనలేని సత్యం. అలాంటి మోడీ ఏపీకి రైల్వే జోన్ విషయంలో మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఇప్పుడు రాజకీయంగా కీలకమైన అసెంబ్లీ సీట్ల పెంపునూ గుట్టుచప్పుడు కాకుండా పక్కనపెట్టారట. పరిస్థితి చూస్తుంటే ఎన్నికల సమయంలో టీడీపీ, టీఆర్ఎస్ కు టికెట్ల పంచాయితీ తప్పేలా లేదు.

సీట్లు పెరుగుతాయని భావిస్తున్న ఈ రెండు పార్టీల అధినేతలకు షాకివ్వాలని అమిత్ షా స్కెచ్ వేశారట. అదే జరిగితే అసలు బీజేపీ ఉనికి లేకుండా పోవడం ఖాయమని కొందరు నేతలు భయపడుతున్నారు. బీజేపీకి సొంతంగా పోటీచేసి ఒక్క సీటు గెలిచే దిక్కు లేదని, అలాంటప్పుడు మిత్రులతో కయ్యం ఎందుకని కొందరు మొత్తుకుంటున్నా అమిత్ షా మాత్రం పెడచెవిన పెడుతున్నారట. ఎన్నికల నాటికి సీట్లు పెంచకపోతే తమ సత్తా చూపిస్తామని తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు కేంద్రాన్ని హెచ్చరించడం అసలు కొసమెరుపు.

- Advertisment -
spot_img

Most Popular