మోడీతో ఢీ అంటున్న విపక్షాలు…!!

0
150
modi and opposition parties fight for india president candidate

Posted [relativedate]

modi and opposition parties fight for india president candidateగెలవలేమని తెలుసు. అసలు పోటీ కూడా ఇవ్వలేమని క్లారిటీ ఉంది. అయినా సరే రాష్ట్రపతి ఎన్నికల్లో అవసరమైతే ప్రధాని మోడీని ఢీకొట్టాలని విపక్షాలు రెడీ అవుతున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ పేరుతో ఒకే గూటికి వచ్చిన పదహారు విపక్షాలు.. ఇదే ఐకమత్యాన్ని ఎన్నికల వరకూ కొనసాగించాలని డిసైడయ్యాయి. కూటమి బలం పెంచుకోవడం కోసం రాష్ట్రపతి రేసులో బరిలోకి దిగాలని డిసైడయ్యాయి. ఉమ్మడి అభ్యర్థికి కేంద్రం అంగీకరిస్తే సరేసరి, లేదంటే పోటీ తప్పదని సంకేతాలు పంపిస్తున్నాయి.

ప్రతిపక్షాలకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ దృష్టిలో ముగ్గురు నేతలు రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉన్నారు. శరద్ పవార్, కరణ్ సింగ్, గులాం నబీ ఆజాద్ లో ఎవరో ఒకర్ని ఉమ్మడి అభ్యర్థిగా అంగీకరించాలని మోడీకి ప్రతిపాదిస్తున్నారు. కానీ ప్రధాని మనసులో వేరే ఆలోచనలున్నాయి. ఆయన బీజేపీని బలోపేతం చేసే దిశగా రాష్ట్రపతి అభ్యర్థి ఉండాలని భావిస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వారెవరూ అంత సమర్థులు కాదనేది బీజేపీ అంతర్గత అభిప్రాయం. పవార్ రిటైర్డ్ హర్ట్ కాగా, కరణ్ సింగ్ ఎప్పుడో ఫేడవుట్ అయ్యారు. ఇక ఆజాద్ కు అంత సీన్ లేదు. ఇదీ బీజేపీ లెక్క.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి థావర్ చంద్ గెహ్లాట్ ను దించుతుందని పది రోజుల క్రితం హడావిడి జరిగినా.. తర్వాత సద్దుమణిగింది. కానీ యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ను ఎంపిక చేసిన మోడీ, షా ద్వయం ఈసారి కూడా అందర్నీ ఆశ్చర్యపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. యూపీ విషయంలో ప్రతిపక్షాలెవరూ ఊహించని వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠమెక్కించిన మోడీ.. రాష్ట్రపతిగా కూడా ఎవరూ వేలెత్తిచూపలేని వ్యక్తిని వెతికే పనిలో ఉన్నారు. మొన్నటి ఎన్డీఏ పక్షాల భేటీలో కూడా ఏకాభిప్రాయం కుదిరిందని, అభ్యర్థి ఎవరో అందరికీ తెలుసంటున్నారు. కానీ విపక్షాలకు షాకివ్వాలనే గోప్యత పాటిస్తున్నారనేది అసలు విషయం.

Leave a Reply