బాబు కి మోడీ మరో పరీక్ష….

107

Posted November 28, 2016, 4:29 pm

Image result for modi appointed chandrababu for leader of chief ministers meeting

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడుకు ప్రధాని మోడీ మరో పరీక్ష పెడుతున్నారా అంటే ఆవును అనే అనాల్సి వస్తోంది .తాజా గా బీహార్ ,మధ్య ప్రదేశ్ ,పుదుచ్చేరి ,త్రిపుర తో పాటు ఆంధ్రప్రదేశ్తో కలిపి అనుకూల, వ్యతిరేక ఐదు రాష్ట్రాల సి ఎం ల సమావేశానికి సారధ్యం వహించాని ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జై ట్లీ ఫోన్ చేసి చెప్పడం ఉదాహరణ.పెద్ద నోట్ల రద్దు వ్యవహారానికి సంబంధించి తాను ముందే కేంద్రానికి లేఖ రాసాను అని మొదట్లో చెప్పడం, ఆ తర్వాత ప్రజల ఇబ్బందుల్ని గమనించి రద్దు తొందరపాటు చర్య గా అభివర్ణించటం,టీడీపీ శ్రేణుల్లో కూడా చంద్ర బాబు తొందరపడి ప్రకటన చేసేసారు అనే ఫీలింగ్ రావడం వంటివి ఆయన్ని డైలమా లో పడేయటం తో పాటు ప్రతిపక్షాలకి ఊతాన్నిచ్చాయి..

అంతే కాకుండా మోడీ అంతటి వ్యక్తి నేను తప్పు చేసానా అని యాప్ లో సర్వేచేసుకోవటం మాత్రమే కాకుండా, ఈ పరిస్థితి వల్ల నల్ల కుబేరుల నుంచి నాకు ప్రాణ భయం వుంది అంటూ బహిరంగ ప్రకటన చేయటం, బీజేపీ పార్ల మెంటరీ పార్టీ సమావేశములో చెమర్చిన కళ్ళతో భావోద్వేగ ప్రసంగాలు వంటివి చూస్తే సర్వత్రా వల్లభాయ్ పటేల్ వంటి మోడీ సైతం ఇబ్బంది పడ్డారనే తెలుస్తోంది ,సరిగ్గా ఇలాం టి సమయం లో సి ఎం ల సమావేశానికి సారథ్యం వహించాలని పిలుపు రావడం బట్టి చూస్తే మోడీ మరోసారి చంద్రబాబుని సమస్యల్లో నెడుతున్నారా లేక అయన సామర్థ్యం మీద నమ్మకం ఉండి బాధ్యత తలకెత్తు తున్నారా ? అనే డౌట్ రాక తప్పదు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here