ప్రధాని ఆ సీఎం కి శుభాకాంక్షలు చెప్పారు..

0
462

  modi birthday wishes kejriwal twitterఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 48వ పుట్టిన రోజు… చాలా మంది ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. కేజ్రీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు కాబట్టి చాలా మంది ట్విట్టర్ ద్వారానే ఆయనకు విషెస్ పంపారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్ కు విషెస్ చెప్పారు. కేజ్రీవాల్ ఎక్కువ కాలం పాటు సుఖంగా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు మోడీ.ఈ ఆకాంక్ష లో రాజకీయాన్ని వెతికారు నెటిజన్లు..

కేజ్రీవాల్ ఈ మధ్యే ప్రధాని మోడీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య లు చేశారు. తనను అంతమొందించేదాకా మోడీ నిద్రపోరని కేజ్రీవాల్ అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ తన విషెస్ ను వ్యూహాత్మకంగా, చతురతతో అలా పంపారన్నది నెటిజన్ల భావన.జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో కేజ్రీవాల్ నమస్కరించినా మోడీ పట్టించుకోలేదు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ సమయంలో మోడీ ప్రసంగిస్తున్నపుడు కేజ్రీవాల్ నిద్రపోతూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి సత్సంబంధాలు అసలే లేవు.

అనేకమంది ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరికి కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ కూడా కేసుల్లో ఇరుక్కున్నారు. కేజ్రీ ఎప్పుడూ మోడీని విమర్శిస్తూనే ఉంటారు. పంజాబ్, హర్యానా, యూపీ ఎన్నికల్లో కేజ్రీ వాల్ దిగుతుండడం బీజేపీకి నచ్చలేదు.. ఈ దృష్ట్యా ఇద్దరి మధ్యా తీవ్ర రాజకీయ ద్వేషం రగుల్కొంది. ఆప్ ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రం అడ్డుకుంటూనే ఉంది. దాంతో ఆగ్రహించిన కేజ్రీవాల్ తనను హత్యచేసేందుకు కుట్ర జరుగుతోందన్న సంచలన ఆరోపణ కూడా చేసేశారు.

Leave a Reply