నోట్ల రద్దుతో హీరోలకు గట్టి షాక్..!

Posted November 9, 2016

Modi Black Money Program Shock To Hero'sస్టార్ సినిమా అంటే సినిమా బడ్జెట్ ఎంత అని ఆరా తీస్తుంటారు. ఇక అందులో సినిమా ప్రొడక్షన్ అయ్యే ఖర్చు కన్నా హీరో రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది. కోట్ల కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నేటితరం హీరోలకు కేంద్ర ప్రభుత్వం సరైన షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేందర్ మోది 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేశారు. అయితే ఈ నిర్ణయంతో స్టార్ హీరోలకు చెమటలు పట్టించేలా చేసింది.

ఎందుకలాగా అంటే రెమ్యునరేషన్ రూపంలో తీసుకునే ఎమౌంట్ సగానికి పైగా లెక్క తేల్చకుండా లిక్విడ్ క్యాష్ గానే ఏదైతే బ్యాన్ చేయబడ్డ 500, 1000 రూపాయల నోట్లతో దాచుకుంటున్నారట. ట్యాక్స్ విషయంలో కడుతున్నట్టు కనిపించినా హీరోల దగ్గర బ్లాక్ మనీ మెసులుతుంది అన్నది ఇన్నర్ టాక్. అయితే మోది నిర్ణయతో ఒక్కసారిగా వారిలో కూడా వణుకు పుట్టింది.

ప్రొడ్యూసర్స్ హీరోలకు ఇచ్చే ఎమౌంట్ కు లెక్కా పత్రం ఉండదు.. చెప్పడానికి పైకి ఒకటి లోపల ఇంకోటి జరుగుతుంది. ఇదంతా బ్లాక్ మనియా అనే చెప్పొచ్చు. ఇక ప్రొడక్షన్ మీద పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కనబడుతుంది. సో ఈ దెబ్బతో స్టార్ రెమ్యునరేషన్స్ కూడా దెబ్బ పడే ఛాన్సులు ఉన్నాయనిపిస్తుంది.

ఇక కొంతమంది నిర్మాతలు కూడా అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బుని సినిమాల్లో పెడుతున్నారన్న టాక్ ఉంది. వారికి కూడా ఈ నోట్ల రద్దు కార్యక్రమం హార్ట్ ఎటాక్ తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వ ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తున్నా తన మార్క్ సంచలనం సృష్టించలేదేంటి అని అనుకున్న వారందరికి మోది షాక్ ఇచ్చాడు.

500, 1000 నోట్లను కోట్లకు కోట్లు దాచుకున్న బడా బాబులకు ఇదో పెద్ద షాకింగ్ న్యూస్. డిపాజిట్ చేసే వీలున్నా అసలు మొత్తం కక్కాల్సి వస్తుంది అని ఈ విషయం అంతగా మింగుడు పడట్లేదు వారికి.

ఇక మోది తీసుకున్న ఈ నల్లధన నిర్మూళన చర్యలో మొదటి స్టెప్.. 500, 1000 నోట్ల రద్దుకు తన స్పందన తెలియచేస్తూ నేషనల్ ఫ్లాగ్ తో పాటుగా.. 40 నుండి 50 క్లాప్స్ పిక్స్ పెట్టి తన అభినందనలు తెలియచేశాడు. బన్ని ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అవడం విశేషం.

SHARE