మోడికే ఒక బ్రాండ్..

 modi brand ambassador incredible indiaఇన్‌క్రెడిబుల్ ఇండియా’కు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించనున్నారు. ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ పలు చర్చల అనంతరం ప్రధాని మోదీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ యాడ్ ఫిలిమ్స్‌కు సంబంధించిన కానె్సప్ట్‌లను సైతం వారం రోజుల్లో సమర్పించాలని యాడ్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్లను కూడా మంత్రిత్వ శాఖ కోరినట్లు తెలుస్తోంది.

‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’కు సరయిన బ్రాండ్ అంబాసిడర్ ప్రధాని మోదీయేనని, ఎందుకంటే ప్రపంచమంతా పర్యటించే ప్రధాని భారత దేశపు గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయగలరని అంతకుముందు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ సూచనప్రాయంగా చెప్పారు.‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’కు మొన్నటివరకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే విడిచి వెళ్లిపోదామని నా భార్య అంటోంది’ అని అంటూ ఒకానొక సందర్భంలో అమీర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానే్న సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించలేదు. ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహా పలువురి పేర్లు మీడియాలో వినిపిస్తూ వచ్చాయి.

SHARE