ఆ గోడలు బద్దలుగొట్టిన మోడీ..

Posted November 14, 2016

modi break the rules and 500 1000 rs notes banned
దశాబ్దాలుగా దేశానికి ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడడం అలవాటైపోయింది. ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా వాటిని పార్టీల వారీగా ఆలోచించడం,విశ్లేషించడం. ఇంకా వీలైతే కులాలు,మతాలు,ప్రాంతాల వారీగా ఆ నిర్ణయాల్ని చీల్చి చెండాడడం.కానీ ఎప్పటి నుంచో ఉన్న ఈ ధోరణికి ప్రధాని మోడీ బ్రేక్ వేయగలిగారు.500 ,1000 నోట్ల రద్దు నిర్ణయం గురించి పార్టీల విమర్శలు ఎలా ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం రాజకీయాలకి అతీతంగా చర్చ జరుగుతోంది. ఒకే పార్టీ ని అభిమానించే వాళ్ళు,ఒకే కులానికి చెందిన వాళ్ళు,ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు భిన్న వైఖరితో మాట్లాడడం కనిపిస్తోంది.స్వీయ లాభ,నష్టాలు ఈ చర్చల్లో కీల ప్రభావం చూపిస్తున్నాయి.ఏదేమైనా ఇలాంటి అడ్డుగోడలన్నీ మోడీ ఒక్క దెబ్బతో పగిలిపోయాయి.మోడీ చర్య నష్టమో ..లాభమో పక్కన పెడితే విధాన నిర్ణయాలు,దాని ప్రభావం గురించి దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చ మంచిదే.

SHARE