పవన్ స్పీడ్ కి మోడీ బ్రేక్ ..

Posted November 10, 2016

modi break to pavan speed
తెల్ల కాగితం మీద చిన్న గీత గీసిన కంటిచూపంతా అటు వైపే వెళుతుంది …కాగితానికి సరిపడా పెద్ద గీత గీసాక ఏ మూలనో చిన్న గీత గీస్తే అది కంటికంత స్పష్టంగా కనబడుతుందని అనుకోలేము.ఇప్పుడు అనంతపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన సభ చిన్న గీత అయితే మోడీ తీసుకున్న 500 ,1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం పెద్ద గీత .జనమంతా మోడీ నిర్ణయం ప్రభావం ఏమిటి?వ్యక్తిగతంగా జరిగే నష్టమేమిటి …లాభమేమిటి ?అని లెక్కలు వేసుకుంటున్నారు.తెలిసిన వాళ్ళని కాస్త ఆర్ధిక పరిజ్ఞానం ఉన్నోళ్లని అడిగి తమ దగ్గరున్న డబ్బు ఎలా మార్చుకోవాలో ప్రణాళికలు వేసుకుంటున్నారు.ఈ టైం లో పవన్ సభ మీద జనం దృష్టి నిలపడం కాస్త కష్టమే .

మోడీ పెద్ద గీత ముందు పవన్ సభ చిన్న గీత అన్న విషయాన్ని పక్కనబెడితే అనంత సభ మరికొన్ని రకాలుగా కూడా జనసేనాధిపతి సవాలే.ప్రత్యేక హోదా అన్నది జనసేన సభ ప్రధాన అజెండా అయినప్పటికీ దేశాన్ని కుదిపేస్తున్న పెద్ద నోట్ల రద్దు అంశం మీద కూడా ఓ రాజకీయ పార్టీగా జనసేన స్పందించాల్సి ఉంటుంది .అయితే ఇప్పటికిప్పుడు దాని ప్రభావం మీద రాజకీయ ఉద్దండులు ,ఆర్ధిక పండితులు కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు .ఆ అంశాన్ని ఆలా వదిలేయనూ లేరు .ఈ రకంగానూ పవన్ దూకుడుకి మోడీ బ్రేకులేసినట్టే ..ఈ సవాల్ ని పవన్ ఎలా అధిగమిస్తారో?అనంత సభలో ఏమి మాట్లాడతారో చూద్దాం

SHARE