Monday, February 6, 2023
Homelatestశశికళతో బీజేపీ కి పనిపడింది.

శశికళతో బీజేపీ కి పనిపడింది.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వసుదేవుడు అంతటివాడు అన్న నానుడి తెలిసిందే.ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా అదే అయ్యేలా వుంది. జయ మరణం తర్వాత శశికళ ని నిలువరించడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఉపయోగించని అస్త్రం లేదు. ఈడీ, సిబిఐ, ఐటీ.. ఇలా అన్ని అస్త్రాలు ప్రయోగించినా శశికళ అనుకున్నవాళ్ళే తమిళనాడు సీఎం కాకుండా ఆపలేకపోయింది బీజేపీ. ఆ కోపం పట్టలేకే సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం ని ఒక్కటి చేసి శశికళని అన్నాడీఎంకే కి పూర్తిగా దూరం చేయాలని చూసింది. అయినా లాభం లేకపోయింది. శశి మాత్రమే కాదు ఆమెకి కుడిభుజం లాంటి దినకరన్ జైలుకెళ్లి వచ్చినా అన్నాడీఎంకే మీద బీజేపీ పట్టు సాధించలేకపోయింది. బీజేపీ దగ్గరున్న అస్త్రాలన్నీ అయిపోవచ్చాయి. అటు శశికళ టీం నిండా మునిగాక చలి ఏంటన్న ధోరణిలో వుంది.

కాలం ఏమైనా మార్చగలదన్న మాట ఇంకోసారి నిజం చేస్తూ రాష్ట్రపతి ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఆ ఎన్నికల్లో గెలవాలంటే అన్నాడీఎంకే ఓట్లు బీజేపీ కి చాలా అవసరం. కానీ ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రజాప్రతినిధుల్లో శశికళ కి పట్టు బాగానే వుంది. జైలుకి వెళ్లొచ్చిన దినకరన్ కూడా ఇప్పటికీ ఎమ్మెల్యేలు గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ఇదంతా గమనించిన బీజేపీ కి తత్వం బోధపడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నాడీఎంకే మీద శశికళ ముద్ర తొలిగించలేమని అర్ధమైంది. అందుకే శశి టీం ని మంచి చూసుకుని రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు రాబట్టడానికి నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కమలం పెద్దల నుంచి కబురు రావడం వల్లే దినకరన్ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. పరస్పర ప్రయోజనాలు దెబ్బతీసుకోకుండా ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తాను జైలుకెళ్లినా, దేశాన్ని గడగడలాడిస్తున్న మోడీని ఢీకొట్టి బీజేపీ ని రాజీ దిశగా నడిచేలా చేసిన శశికళని మెచ్చుకోవాల్సిందే.

- Advertisment -
spot_img

Most Popular