శంఖారావం తర్వాత రాయబారమా బాబూ?

0
547

modi cm chandra babu
ఎవరైనా యుద్ధప్రకటన చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు..ఓ సారి యుద్ధానికి సై అన్నాక రణతంత్రానికి పదును పెడతారు.కానీ చంద్రబాబు మాత్రం శంఖారావం తర్వాత రాయబార ప్రస్తావన చేసి అందర్నీ అయోమయంలో పడేశారు.అరుణ్ జైట్లీ రాజ్యసభలో మాట్లాడిన రోజు ..చంద్రబాబు మాట,పలుకు తీక్షణమనిపించాయి.యుద్ధానికి సిద్ధమన్నట్టే బాబు స్పందించారు.రాజ్యసభలో దూకుడుగా మాట్లాడలేదని సుజనా,రమేష్ ల మీద కూడా గుస్సా అయ్యారు.రాజ్యసభ లో జరిగింది గతం..ఇక లోక్ సభలో తేల్చుకుంటాం అన్నారు.

విజయవాడలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేశారు.హోదా పోరాటంపై దిశానిర్ధేశం చేశారు.ఇక యుద్ధమే తరువాయి అనుకున్నప్పుడు బాబు నోట వచ్చింది రాయబారం మాట..చివరి ప్రయత్నంగా ఎంపీల బృందాన్ని మోడీ దగ్గరకు పంపుతామని బాబు చెప్పారు.అప్పటికి ఫలితం రాకపోతే పోరాటమే శరణ్యమని సీఎం అన్నారు.

కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఓవిషయం సుస్పష్టం .ఎంపీలు వెళ్లి అడిగితే మోడీ సరే చేద్దామంటారు ..కానీ ఎప్పటిలాగానే వ్యవహరిస్తే ? కొంతకాలం గడిచాక విషయం అర్ధమవుతుంది.పోరాటానికి అవకాశం ఉండొచ్చేమో…కానీ ఇప్పుడున్న వేడి అప్పుడు ఉంటుందా ?అదను దాటాక పదును తగ్గదా ? స్వయంగా బాబుమాటల్లో మొదటిరోజుకి రెండోరోజుకు చాలా తేడా వచ్చింది.లోక్ సభను స్తంభింపచేస్తామని మొదట చెప్పారు.తర్వాత సభ వెలుపల నిరసన అంటున్నారు .

తెలంగాణా ఉద్యమ సమయంలో ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కూడా అక్కడే కూర్చునేవారు.చివరకు ఓ రాష్ట్రాన్ని త్యాగం చేసే నిర్ణయం తీసుకున్నా ప్రయోజనం లేకపోవడం కళ్ళ ముందే చూశాం. పరిస్థితి ,సందర్భం వేరు కావచ్చు … చంద్రబాబు ఆఖరిప్రయత్నం మంచి ఫలితం రాబట్టవచ్చేమో కూడా…అలా అనుకున్నప్పుడు శంఖారావానికన్నా ముందే రాయబారాయానికి పంపితే బాగుండేది . రాజకీయమైనా…రణమైనా ఆఖరిఅస్త్రం చివర గానే వాడాలి.లేకపోతే ప్రత్యర్థికి మరో అస్త్రం ఇచ్చిన వాళ్ళవుతాం ..మన బలహీనత చెప్పిన వాళ్ళవుతాం ..

Leave a Reply