ఈ నెల 15 నుంచి భారీగా ఐటీ దాడులు?

Posted December 12, 2016

modi decided it rides on black money holders in all over india
ప్రధాని మోడీ మరోసారి నల్ల కుబేరులపై అదిరిపోయే అస్త్రం ప్రయోగించనున్నట్టు తెలుస్తోంది. నోట్ల రద్దు తర్వాత కూడా బడా బాబులు పెద్ద ఎత్తున కొత్త నోట్లని దక్కించుకున్న తీరు మోడీని కలవరపరిచిందట.అందుకే అయన ఈ నెల 15 నుంచి నల్ల ధనాన్ని వెలికితీసేందుకు పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరపడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఐటీ,విజిలెన్స్,సిబిఐ,సీఐడీ విభాగాలకు ఇందుకు సంబంధించిన ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.ఒక్క ఐటీ విభాగపు సిబ్బంది దాడులకు సరిపోనందున అన్ని విభాగాల్ని ఏక కాలంలో రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 15 నుంచి భారీ దాడుల ముహూర్తం వెనుక ఓ వ్యూహం వుంది.ఇప్పటికే కేంద్ర ఆర్ధిక శాఖ చివరి దఫా నల్లధన ప్రకటనకు అవకాశం ఇచ్చింది.దాన్ని వినియోగించుకుంటున్న వారి సంఖ్య పరిమితం గా వుంది.పైగా ఈ నెల 15 దాకా త్రైమాసిక ముందస్తు పన్ను చెల్లింపులకు అవకాశం వుంది.ఆ గడువు పూర్తికాగానే ఆర్ధిక అవకతవకల్ని బయటపెట్టేందుకు పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరగబోతున్నట్టు సమాచారం.

SHARE