మోడీ తిట్టలేదని కాంగ్రెస్ బాధ..

 modi didn't scold congress unhappy
ప్రధాని పీఠం ఎక్కిన తరువాత నరేంద్ర మోడీ దేశీయంగా మాట్లాడినది తక్కువ .విదేశాల్లోమాట్లాడింది ఎక్కువ .ఇక ప్రెస్ తో మాట్లాడింది మరీ తక్కువ .అలాటి మోడీ ఉన్నట్టుండి అంత సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఎందుకిచ్చారు?వాటిని అన్ని స్థానిక పత్రికల్లో వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ ఎందుకు తీసుకున్నారు? .అంత పెద్ద ఇంటర్వ్యూలో రాజకీయం గురించి తక్కువెందుకు మాట్లాడారు ?ఈ విషయమే 10 జన్ పద్ కూడా ఆందోళనపడుతోంది .

కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శల ద్వారా ఆ పార్టీకి లేనిపోని ప్రాధాన్యం ఇవ్వడం తగదని మోడీ భావిస్తున్నారు .ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల అంశం దృష్టిలో ఉన్నప్పటికీ అక్కడ కమలం పోటీ కాంగ్రెస్ తో కాదని ..ప్రాంతీయ శక్తులతోనని మోడీ గమనించారు .అందుకే ఆయన తాను సామాన్యుడినని చెప్పుకోడానికే ప్రాధాన్యమిచ్చారు .అంబెడ్కర్ ప్రస్తావన పదేపదే తెస్తున్నారు .కుల రాజకీయాలు తగవని ..అభివృద్ధి రాజకీయాలు కావాలని మోడీ చెప్పిన మాటలు యూపీ ఎన్నికలకోసమేనని ఓ విశ్లేషణ .ఇదంతా కాంగ్రెస్ కి పుండు మీద కారంలా వుంది .కనీసం తమను మోడీ పోటీదారుగా గుర్తించలేదని బాధపడుతోంది .విమర్శించకుండా భాద పెట్టొచ్చని మోడీ ..తిట్టలేదని బాధపడుతూ కాంగ్రస్ దేశరాజకీయ సరళిని భలే ప్రతిబింబించారు .

SHARE