డిఫెన్స్ లో అఫెన్స్….

0
661

  modi difence effence

యోగా ప్రచారం లో ఇల్లెక్కికూసిన మోడీ సర్కార్ రక్షణ రంగంలో కీలకు నిర్ణయాలకు మాత్రం సైలెంట్ గా సరేనంది. దేశ భద్రతకు సంబంధించిన రక్షణ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది.దీంతోపాటు విమానయానంలోనూ 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు తెరిచింది.ఇక ఫార్మా రంగంలో మాత్రం 74 శాతానికి మాత్రమే పరిమితమైంది.ఒకప్పుడు ఈ మూడు రంగాలలో కేవలం 49 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉండేది.కీలకమైన ఈ మూడు రంగాల్లోకి విదేశీ సంస్థల రాక ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదానిపై భిన్నవాదనలున్నాయి.కొంతకాలం గడిస్తే గాని దీనిపై ఓ నిర్ణయానికి రాలేము..కానీ ఒక్కటి మాత్రం  గమనించాల్సిన అంశముంది.

ఒకప్పుడు UPA సర్కార్ ఇదే ప్రతిపాదన తెస్తే BJP కరాఖండిగా నో చెప్పింది.అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అదే నిర్ణయానికి సై అంది..ఇపుడు కాంగ్రెస్ స్వరం మారుతోంది.ఏముంది వారు వీరయ్యారు..

Leave a Reply