మోడీ గజ్వేల్ సభ బులెట్ పాయింట్స్

modi gajwel sabha bullet points

 

 

 

 

 

సోదర, సోదరీమణులరా…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి కి రావడం నాకు చాలా సంతోషం గా ఉంది
తెలంగాణ రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం
తెలంగాణ ప్రజల స్వప్నాలన్నింటిని తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం నాకుంది
GST కి తెరాస ప్రభుత్వం బాగా సహకరించింది
కేసీఆర్ సీఎం అయ్యాక నాకెన్నో సార్లు కలిశారు…ప్రతిసారీ తెలంగాణ అభివృద్ధి పైనే మాట్లాడే వారు. అందులో నీటి గురించే ఎక్కువగా చర్చించేవారు
తెలంగాణ ప్రజలందరికీ ఇంటింటికి మంచి నీరు ఇస్తానని అనేవారు
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు
నీరు సమృద్ధిగా దొరికితే…మట్టిలోనుంచి బంగారం తీయొచ్చు

PMKSY ద్వారా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం
ప్రతి వర్షపు చుక్కని వినియోగించాలి
పీయూష్ గోయల్ నాయకత్వంలో విద్యుత్ కొరత తో ఉన్న రాష్ట్రాలు కూడా విద్యుత్ మిగులు (సర్ ప్లస్) రాష్ట్రాలుగా ఈ రెండేళ్లలో అయ్యాయి
సోలార్ విద్యుత్ ని ప్రోత్సహిస్తున్నాం
రైల్ ప్రాజెక్టు ను పూర్తి చేస్తాం
RFCL ని పునరుద్దరిస్తాం.. రైతులకి అండగా ఉంటాం
రైతులు బ్లాక్ మార్కెట్స్ లో ఎరువులు కొనకుండా చేశాం.. తగిన ఎరువులు అందుబాటులో ఉంచాం
ఈ రెండేళ్లలో ఏ ముఖ్యమంత్రి యూరియా కొరత ఉందని కేంద్రానికి లేఖ రాయలేదు
కేసీఆర్ బీజేపీ ప్రభుత్వం లో లేకున్నా… మా ప్రభుత్వం నిజాయితీగా ఉందని మెచ్చుకున్నారు
ఆవులని వ్యవసాయం తో జోడించండి
గో రక్ష కోసం చర్యలు చేపట్టాం
నకిలీ గో రక్ష పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా..
మీరు ఢిల్లీ ని ఎలా చూస్తారో….మేము హైదరాబాద్ ని అలానే చూస్తాం

SHARE