Posted [relativedate]
ఓ నేతకి రాజకీయంగా కాలం ఇంతగా కలిసి రావడం దేశచరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేదు.ఒక్క మోడీ విషయంలోనే ఇది సాధ్యమైంది.అన్ని పరిణామాలు ఆయనకు కలిసి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన బీజేపీ లోనే కాదు దేశం మొత్తం మీద తిరుగులేని నేతగా ఆవిర్భవిస్తున్నారు. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటున్నప్పటికీ సీనియర్ నేత అద్వానీ విషయంలో మాత్రం మోడీకి ఎక్కడో తెలియని డౌట్.ఆ అడ్డం కూడా ఇప్పుడు తొలగిపోయింది.బాబ్రీ విధ్వంసం అంశంలో సుప్రీమ్ కోర్ట్ తాజాగా కేసుల పునరుద్దరణకు ఆదేశాలు ఇవ్వడంతో బీజేపీ సీనియర్ నేతలు ఇరుక్కుపోయారు.ఈ జాబితాలో అద్వానీ,మురళి మనోహర్ జోషి,ఉమా భారతి లాంటి వాళ్ళు వున్నారు.అయితే అద్వానీ,జోషి విషయంలో మోడీ,అమిత్ షా పైకి ఏమంటున్నా లోలోపల సంతోషపడుతూ ఉండి వుంటారు.