మోడీకి కోప‌మొచ్చింది!!!

Posted March 22, 2017

modi is angry about absenties
ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి ఎప్పుడో గానీ కోపం రాదు. వ‌స్తే అది ప్ర‌ళ‌యమే. అలాంటి న‌రేంద్ర‌మోడీకి ఇటీవ‌ల కోప‌మొచ్చింది.అది కూడా సొంత‌పార్టీ ఎంపీల‌పై. కొన్నిరోజులుగా లోక్ స‌భ‌కు బీజేపీ ఎంపీలు డుమ్మా కొడుతున్నారు. ముఖ్య‌మైన అంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతున్నా వారి జాడ కనిపించ‌డం లేదు.

మంగ‌ళ‌వారం లోక్ స‌భ‌లో కోరం లేక‌పోవ‌డంతో పార్ల‌మెంటు కార్య‌క‌లాపాలు ఆల‌స్యంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ విష‌యం మోడీ దృష్టికి వెళ్లింది. అదే స‌మ‌యంలో మోడీ స‌భ‌కు వ‌చ్చారు. చూస్తే సొంత పార్టీ స‌భ్యుల సీట్లు ఖాళీఖాళీగా క‌నిపించాయి. అంతే .. ప్ర‌ధాని విప‌రీత‌మైన కోపం వ‌చ్చింద‌ట‌. ఇత‌ర పార్టీలంటే ఏమో కానీ.. స‌రిప‌డా బ‌లం ఉండి.. బీజేపీ స‌భ్యులు స‌భ‌కు హాజ‌రు కాక‌పోవ‌డంపై ఆయ‌న చాలా సీరియ‌స్ అయ్యార‌ని స‌మాచారం.

మంగ‌ళ‌వారం స‌భ‌కు వ‌చ్చిన బీజేపీ స‌భ్యులు ఎవ‌రు? డుమ్మా కొట్టిన వారెవ‌రు? ఈ లిస్టును ప్ర‌ధాని మోడీ తీసుకున్నార‌ట‌. అంతేకాదు చాలామంది ఢిల్లీలో ఉండి కూడా స‌భ‌కు హాజ‌రు కాలేద‌న్న విష‌యం హైక‌మాండ్ దృష్టికి వ‌చ్చింద‌ట‌. దీంతో లోక్ స‌భ‌కు గైర్హాజ‌రైన వారంద‌రికీ బీజేపీ అధినాయ‌క‌త్వం నుంచి చీవాట్లు ప‌డ్డాయ‌ని టాక్. ఇలా అయితే నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ప‌నుల్లో…అవాంత‌రాలు త‌ప్ప‌వ‌ని కూడా హెచ్చ‌రించార‌ట‌. మొత్తానికి మోడీకి కోప‌మొస్తే ఎలా ఉంటుందో… ఇది జ‌స్ట్ శాంపుల్ మాత్ర‌మేన‌ని… మ‌రోసారి రిపీటైతే సినిమా వేరే ర‌కంగా ఉంటుంద‌ని ఆ పార్టీ స‌భ్యులు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు.

SHARE