ప్రత్యేకహోదాకి మోడీ పీటముడి?

0
772

modi knot special status

కాస్త ముభావంగా ఉండే ప్రధాని నరేంద్ర మోడీ మోముపై చిరునవ్వు … అంటీఅంటనట్టు వుండే మోడీ ఈసారి కాస్త హాయిగా మాట్లాడారు. ప్రత్యేకహోదా అంశాన్ని వీలైనంత త్వరలో తేల్చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబుకి, ఎంపీలకు హామీ ఇచ్చారు. ఇదంతా చూసి అందరూ చంకలు గుద్దుకుంటున్నారు… కానీ చాపకింద నీరులా మోడీ హోదాకి పీటముడి వేశారు. అదేంటో మీరు చూడండి.

ఇప్పటిదాకా అరుణ్ జైట్లీ, ఇతర బీజేపీ నేతలు 14 వ ఆర్ధిక సంఘాన్ని హోదాతో ముడిపెట్టి తప్పించుకొనే ప్రయత్నం చేశారు. తాజాగా మోడీ జాతీయ ఆర్ధిక మండలికి ముడిపెట్టారు. అందులో సభ్యులైన ముఖ్యమంత్రులందర్నీ ఒప్పించాలికదా అని కూనిరాగం తీశారు. ముఖ్యంగా జయ, మమత, నితీష్, నవీన్ లను ఒప్పించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరితో అనధికారిక చర్చల ద్వారా ఆంధ్రకు హోదా అంశాన్ని పరిష్కరిస్తామని మోడీ చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.

మొండి ఘటాలైన జయ, మమత లని ఒప్పించే భాద్యత కేంద్రమంత్రి వెంకయ్యకు … నితీష్, నవీన్ లను ఒప్పించే పని చంద్రబాబుకి అప్పగించారట. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు తమ ఆందోళన వ్యక్తం చేశాయి. తమకు నష్టం జరిగే పనిని ఆయా రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు ఎలా ఒప్పుకుంటారు? నిజంగా ఈ పని సాధిస్తే మోడీ, బాబుల్ని మెచ్చుకోవాల్సిందే… లేదంటే మరో పీఠముడితో మోడీ దిగ్విజయంగా విషయాన్ని పక్కదారి పట్టించినట్టే.

Leave a Reply