ఆగష్టు 15 న మోడీ అబద్ధం చెప్పారా ?

 modi lied speech august 15దేశ రాజ‌ధానికి 4 గంట‌ల ప్ర‌యాణ దూరంలో ఉన్న నాగ్లా ఫ‌టెలాలో నేటికి ఇంకా అనేక ఇళ్ల‌ల్లో క‌రెంటు రాలేదంటున్నారు విలేజ్ హెడ్ యోగేష్ కుమార్. స్వాతంత్ర‌దినోత్స‌వం రోజున ఈ గ్రామానికి కరెంటు ఇచ్చామ‌ని మోడీ చెబుతున్నా అలాంటిదేమి జ‌ర‌గ‌లేద‌న్నారు యోగేష్. 2013 నుంచి తాము కరెంటు కోసం ఎదురు చూస్తున్నామ‌ని తెలిపారు. బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లయినా కేవలం బోర్ బావులకు మాత్రమే విద్యుత్తును అందించిందన్నారు గ్రామపెద్ద. అనేక ఇళ్లలో చీకటి సమ‌స్య అలాగే ఉంద‌న్నారాయ‌న‌. సుమారు 600 ఇళ్ల‌ల్లో బ‌ల్బులు వెల‌గ‌డం లేద‌ని వాపోయారు ఆ గ్రామాధికారి.

రాష్ట్రంలో కొన్ని గ్రామాలు గాఢ అంధ‌కారంలో ఉన్న సంగ‌తి నిజ‌మేన‌ని తెలిపారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప‌వ‌ర్ కార్పోరేష‌న్ అధికారులు. అయితే చాలా గ్రామాల్లో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా దొంగ క‌రెంటు వాడుతున్నార‌ని..బిల్లులు క‌ట్ట‌లేక ప్ర‌జ‌లు ఇంకా చీక‌ట్లోనే ఉంటున్నారని తెలియ‌జేశారు. గ‌త 25 ఏళ్ల క్రింద‌ట ప్ర‌జ‌లు విద్యుత్ చార్జీలు క‌రెక్టుగా క‌ట్టేవార‌ని తెలిపారు. రాజీవ్ గాంధీ గ్రామీణ‌ విద్యుదీక‌ర‌ణ ప‌థ‌కంలో భాగంగా అన్ని గ్రామాల‌కు విద్యుత్ అందించ‌డానికి కావ‌ల‌సిన మౌళిక వ‌సతుల‌ను అందించ‌నున్న‌ట్టు అధికారులు వెల్లడించారు. 150 గ్రామాల్లో ప్ర‌జ‌లు త‌మ స్వంతంగా కేబుల్స్ వేసుకున్నార‌ని తెలియ‌జేశారు.

SHARE