బిచ్చగాడి దెబ్బకి పాక్ బిక్కుబిక్కు ..

Posted October 1, 2016

modi national security advisor ajit dovalఒకప్పుడు పాక్ వీధుల్లోబిచ్చమెత్తినవాడే ఇప్పుడు ఆ దేశానికి చెమటలు పట్టిస్తున్నాడు.అయన మరెవరో కాదు ప్రధాని నరేంద్ర మోడీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.భారత సైనిక సహనం చేతకానితనమని భావించిన,భావిస్తున్న దేశాలకి తాజా సర్జికల్ స్ట్రైక్స్ తో తిరుగులేని జవాబు ఇచ్చేలా మోడీకి ప్రేరణ ఇచ్చింది ఈయనే.దోవల్ చూడడానికి ఎంత సింపుల్ గా వుంటారు కానీ అయన సాహసాలు జేమ్స్ బాండ్ కి ఏ మాత్రం తీసిపోవు.అయన చేసే సైనిక దాడులే కాదు వ్యూహాత్మక ఎత్తుగడలు శత్రువుల్ని నిర్వీర్యం చేసి పడేస్తాయి.

దోవల్ 1945 లో ఇప్పటి ఉత్తరాఖండ్ ప్రాంతం లో పుట్టారు.అయన తండ్రి కూడా సైన్యంలో పనిచేసేవారు.దీంతో దోవల్ ప్రాధమిక విద్యాభ్యాసం రాజస్థాన్ లోని అజ్మీర్ దగ్గరున్న సైనిక స్కూల్ లో తరువాత ఆగ్రాలో సాగింది.ఎం.ఏ ఎకనామిక్స్ చేసిన దోవల్ ips అయ్యారు.1968 లో కేరళ క్యాడర్ లో జాయిన్ అయ్యారు.అయన చురుకుదనం,ఎత్తుగడలు,సామర్ధ్యం చూసి ఇంటలిజెన్స్ విభాగం ఆయన్ను ప్రోత్సహించింది.1971 నుంచి 1999 దాకా జరిగిన 15 విమాన హైజాక్ సందర్భాల్లో ఆయనది కీలక పాత్ర.హైజాకెర్ల భరతం పట్టే వ్యూహాల్ని రచించారు.కాందహార్ హైజాక్ సందర్భంలో వెళ్లిన దౌత్యబృందంలో దోవల్ సభ్యుడిగా వున్నారు.ఐబీ లోపదేళ్ళపాటు ఆపరేషన్స్ విభాగాధిపతిగా వున్నారు.అయన హయాంలోనే Mac (మల్టీ ఏజెన్సీ సెంటర్ ),జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇంటలిజెన్స్ వంటి సుశిక్షిత వ్యవస్థలు రూపుదిద్దుకున్నాయి.

ఇంటలిజెన్స్ వ్యవస్థలో వున్నప్పుడే మిజోరాం,సిక్కిం లలో వేర్పాటువాద ఉద్యమాల్ని అణిచివేయడంలో మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించారు.పాక్ లో ఇండియన్ హై కమిషన్ లో ఆరేళ్ళ పాటు బాధ్యతలు నిర్వర్తించారు.ఆ టైం లో పాక్ దుష్ట వ్యూహాలు,ఉగ్రవాద చర్యలపై కన్నెసేందుకు కీలక ప్రాంతాల్లో బిచ్చగాడి అవతారం ఎత్తేవారట.ఆ అనుభవమే ఇప్పుడు పాక్ వ్యూహాలకి కౌంటర్ వేయడంలో దోవల్ కి ఉపయోగపడుతోంది.ఈ మారు వేషాలు పాక్ లోనే కాదు ఇండియాలోనూ ఎన్నో విపత్కర పరిస్థితుల్లో వేశారు.ఆపరేషన్ బ్లూ స్టార్ టైం లో ఓ రిక్షావాడి అవతారంలో స్వర్ణదేవాలయం లోకి వెళ్లి ఉగ్రవాదుల ఆనుపానులు తెలుసుకొని భద్రతా దళాలకు అందించారు దోవల్.ఐబీ నుంచి 2005 లో రిటైర్ అయిన దోవల్ 4 ఏళ్ల తరువాత వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించి అటు దేశ భక్తి ,భద్రత తో పాటు ఆధ్యాత్మిక భావాల్ని ప్రచారం చేస్తున్నారు. మోడీ ప్రధాని అయ్యాక 2014 మే 30 న దోవల్ ని జాతీయభద్రతా సలహాదారుగా నియమించుకున్నారు.ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ఇప్పుడు పాక్ కి చెమటలు పట్టిస్తున్నారు దోవల్.సర్జికల్ స్ట్రైక్స్ చేయడమే కాకుండా వాటిని ప్రపంచానికి వెల్లడించడం ద్వారా ఇకపై భారత్ సైనిక వ్యూహమ్ ,సామర్ధ్యం ఇలా ఉంటుండదని శత్రువులకు తిరుగులేని హెచ్చరికలు పంపిన దోవల్ కి థాంక్స్,హాట్స్ఆఫ్ లాంటి చిన్న మాటలు సరిపోవు.అయన చేతుల్ని స్ఫూర్తిగా తీసుకోవడమే దోవల్ కి సరైన గౌరవం ఇవ్వడం.

SHARE