గురువుకు శిష్యుడి వెన్నుపోటు

0
523
modi plans for advani in babri case

Posted [relativedate]

modi plans for advani in babri caseబాబ్రీ కేసులో సీబీఐ అత్యుత్సాహం చూస్తుంటే అందరికీ మోడీ మీదే డౌట్స్ వస్తున్నాయి. అద్వానీని రాష్ట్రపతి పదవి నుంచి తప్పించడానికే మోడీ ఈ ఎత్తు వేశారనేది అందరి వాదన. తనకు గుజరాత్ సీఎం పదవి ఇచ్చి, గోద్రా అల్లర్ల సమయంలో పదవి పోకుండా కాపాడిన అద్వానీకి.. మోడీ ఇస్తున్న గురుదక్షిణ చూసి అందరూ విస్తుపోతున్నారు. ఎవరైనా తనకు సాయం చేసిన గురువుకు.. చేతనైనంత ప్రతిసాయం చేస్తారు కానీ.. మోడీ మాత్రం గురువుకు పంగనామాలు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఎప్పుడో పాతికేళ్ల నాటి బాబ్రీ కేసులో ఇప్పుడు సీబీఐ సుప్రీంకోర్టుకు ఎందుకు అప్పీల్ కు వెళ్లింది, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అద్వానీని వయసు నిబంధనతో క్యాబినెట్లోకి తీసుకోకుండా పక్కనపెట్టిన మోడీ.. కనీసం రాష్ట్రపతి పదవి ఇవ్వడానికి కూడా సముఖంగా లేరు.ఓ దశలో ఆరెస్సెస్ పోనీలే పాపం అనుకున్నా.. మోడీ మాత్రం ససేమిరా అన్నారని వాదన, పైగా ఆరెస్సెస్ కూడా నోరెత్తకుండా దళిత్ అభ్యర్థి పేరుతో కొత్త ముఖాన్ని తెరపైకి తెచ్చే ఎత్తువేశారు. దీంతో ఆరెస్సెస్ కూడా మోడీ మాటకు తలూపాల్సిన పరిస్థితి.

మోడీ మనసులో మాట గ్రహించిన అద్వానీ.. తాను ప్రెసిడెంట్ రేసులో లేనని చెప్పేశారు. కానీ మోడీకి భయం పోలేదు. అద్వానీ బయట ఉంటే ఏదో విధంగా ఆయన్నే రాష్ట్రపతిని చేయాలని మళ్లీ సంఘ్ ప్రయత్నిస్తుందనే.. అడకెత్తరలో పోకచెక్కలా కేసులో ఇరికించేశారనేది అద్వానీ సన్నిహితుల వాదన. 80 ఏళ్ల పండు వయసులో ఆయన్ను ప్రశాంతంగా బతకనివ్వకుండా మోడీ టార్చర్ చేస్తున్నారని వాపోతున్నారు. రెండేళ్లపాటు ప్రతిరోజూ కోర్టుకు హాజరవ్వడం ఎంత కష్టమైన పనో అందరికీ తెలుసు. అలాంటిది ఈ వయసులో అద్వానీ.. హే రామ్..

Leave a Reply