పవన్ ,బీజేపీ మధ్య ఏదో జరిగింది..

0
253
modi react on uddanam kidney patients because of pawan kalyan

  Posted [relativedate]

modi react on uddanam kidney patients because of pawan kalyanఉద్దానం కిడ్నీ వ్యాధి పీడితుల తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం ఫలిస్తున్నట్టే వుంది.ఇంతకు ముందు పవన్ పెట్టిన 48 గంటల డెడ్ లైన్ టైం లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రెస్పాండ్ అయ్యారు.బాధితుల్ని ఆదుకుంటామని …వారికి సురక్షిత నీరు అందించేందుకు వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ బాధితులకి వికలాంగులకు ఇచ్చే అన్ని సౌకర్యాలు ఇస్తామని ప్రకటించారు .పవన్ కూడా బాబు ప్రతిస్పందనని ఆహ్వానించారు.

ఇప్పుడు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా పవన్ డిమాండ్స్ మీద రియాక్ట్ అయ్యారు.సాక్షాత్తు ప్రధాని మోడీ ఆదేశం మేరకి అంటూ ఉద్దానం బాధితుల కోసం కేంద్రం తరపున ఓ వైద్య బృందాన్ని పంపుతున్నట్టు చెప్పారు.ఆ బృందం సూచనల ఆధారంగా సమస్య పరిష్కారం కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు.నిన్నమొన్నటి దాకా పవన్ ని బాగా లైట్ తీసుకున్న మోడీ ఇప్పుడిలా స్పందించడం చూస్తుంటే ఆశ్చర్యంగానే వుంది. పవన్ అంటేనే ఒంటి కాలు మీద లేచిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సిద్ధార్ధనాధ్ సింగ్ ఇటీవల మాట మార్చారు. ఒకప్పుడు పవన్ nda లో ఎప్పుడు పని చేశాడని ప్రశ్నించిన పెద్ద మనిషి ఈ మధ్య బీజేపీ,జనసేన స్నేహం కొనసాగుతుందని సన్నాయినొక్కులు నొక్కారు.ఇప్పుడు ఓ కేంద్ర మంత్రి ఏకంగా మోడీ సూచన అంటూ పవన్ డిమాండ్ కి స్పందించారు. ప్రత్యేక హోదా అంశంలో పవన్ మాట్లాడినప్పుడు బీజేపీ ఎదురుదాడి చేసింది.అయన ఇంకో సమస్య ఎత్తగానే దగ్గరుండి తీరుస్తామంటోంది.ఇదంతా చూస్తుంటే లోపల ఏదో జరిగిందనిపిస్తోంది. అదేమిటయినా …పవన్ డిమాండ్ కి మోడీ స్పందించడం జనసేన సాధించిన పెద్ద విజయమే …

Leave a Reply