నువ్వుకాశ్మీర్ అంటే ..నే బలూచిస్తాన్ అంటా

 modi said pakistan kashmir baltistan

మోడీ సుదర్ఘ ప్రసంగంలో… హైలెట్ లాంటిదేమైనా ఉందంటే.. రెండు అంశాలు మాత్రమే ఉన్నాయి…. పనిలో పనిగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజల వెతల గురించి ప్రస్తావించారు. బలోచిస్థాన్.. గిల్గిత్.. బల్తిస్థాన్ లోని పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు తమపై ఎంతో ప్రేమను ప్రదర్శిస్తున్నారని.. తాను వారి దగ్గర లేకున్నా.. వారిని కలిసే అవకాశం లేకున్నా.. అక్కడి ప్రజలు తన పట్ల ప్రేమ.. అభిమానం.. గౌరవాన్ని చూపిస్తున్నారని.. అదంతా 125 కోట్ల భారతీయులకు చెందిందంటూ మోడీ వ్యాఖ్యలు చేశారు.

ఒక వ్యాఖ్యల నేరుగా పాక్ ప్రభుత్వానికి తగిలేది అయితే.. మరో వ్యాఖ్య పాక్ కు పుమంటపుట్టించే వ్యాఖ్యగా చెప్పాలి. ఇలాంటి మాటలు చెప్పే దమ్ము.. ధైర్యం మోడీకి మాత్రమే సాధ్యమనే చెప్పాలి.తన మాటలతో భారతదేశ ఇమేజ్ గ్రాఫ్ ను భారీగా పెంచేయటమే కాదు.. భారత్ ఎంతటి భావోద్వేగ దేశమన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. మూర్తీభవించిన మానవత్వానికి ప్రతీకన్న విషయాన్ని ఆయన తన మాటలతో స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరాటం చేస్తున్న భారత్.. అదే ఉగ్రవాదానికి బలైన దాయాది దేశం పట్ల జాలిని ప్రదర్శించటం..

ఉగ్రదాడుల కారణంగా చోటు చేసుకున్న మారణహోమంపై భారత జాతి జనులు ఎలాంటి స్పందన ఉంటుందన్న విషయాన్ని చెబుతూ ఒక ఉదాహరణను చెప్పుకొచ్చారు.పాకిస్థాన్లోని పెషావర్ స్కూల్లో ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు.. ఎంతోమంది అమాయకపు చిన్నారులు బలయ్యారు. చదువుల బడి కాస్తా..చిన్నారుల రక్తంతో తడిచిపోయింది. ఈ ఘటనను చూసిన యావత్ భారత జాతి చలించిపోయింది. భారత పార్లమెంటుతో సహా.. దేశంలోని ప్రతి పాఠశాలలోని చిన్నారి కన్నీరు కార్చింది. ప్రతి విద్యార్థి బాధపడ్డాడు. అదీ మానవత్వం అంటే. కానీ.. అక్కడ (పాకిస్థాన్ ను ఉద్దేశించి) ఉగ్రవాదులను కీర్తిస్తున్నారు. భారత్ లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతే.. అక్కడ వేడుకలు చేసుకుంటున్నారు. అలాంటి వారిని.. అక్కడి ప్రభుత్వాన్ని ఏమనాలి?’’ అంటూ సూటిగా ప్రశ్నిస్తూ.. పాక్ ప్రభుత్వానికి.. అక్కడ ప్రజలకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా వ్యాఖ్యలు చేశారు.

SHARE