
ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జాతి నుద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన కొత్త సంవత్సరంలో జాతి నూతనోత్తేజంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
దేశంలో నల్లధనం, అవినీతిని అరికట్టడానికి చేపట్టిన ప్రక్షాళన కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ మద్దతు వచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం తొలిసారిగా జాతి నుద్దేశించి ప్రసంగిస్తున్న మోడీ…పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజల నుంచి వచ్చిన మద్దతు ద్వారా దేశంలో అవినీతిని తుదముట్టించడానికి ప్రజలు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అవగతమైందన్నారు. దీపావళి తరువాత చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం ద్వారా ప్రభుత్వం- ప్రజలు కలిసి అవినీతిపై బృహత్తర పోరాటంలో మమేకమయ్యారని మోడీ చెప్పారు.
దేశ ప్రజల సహకారంతో సాగిన ప్రక్షాళన యుద్ధమిది. ఈ యుద్ధంలో విజయం ప్రజలదే అని ప్రధాని మోడీ అన్నారు. జాతి నుద్దేశించి ప్రసంగిస్తున్న మోడీ పెద్ద నోట్ల రద్దు ద్వారా దీర్ఘకాల ప్రయోజనాలు సాధిస్తామన్నారు. దేశ చరిత్రలో పెద్ద నోట్ల రద్దు చారిత్రాత్మక నిర్ణయమని అభివర్ణించారు. అవినీతిపై ప్రారంభించిన ఈ యుద్ధంలో వెనుకడుగు వద్దని ఈ 50 రోజులలో తనకు వేలాది లేఖలు అందాయని మోడీ చెప్పారు. నోట్ల రద్దు కారణంగా నగదు కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడిన మాటవాస్తవమని చెప్పిన ప్రధాని…ప్రజలు ఎంతో సహనంతో ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
కృత నిశ్చయంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం దీపావళి తర్వాత దేశం కీలక నిర్ణయం తీసుకుంది సమాజంలోని నల్లధనం, బ్లాక్ మార్కెటింగ్ నిజాయితీపరుల్నినిరాశపరిచాయి దేశవ్యాప్తంగా ప్రజలు ధైర్యంతో కష్టాలు ఎదుర్కొంటూ చెడుపై విజయం సాధించేందుకు పోరాడుతున్నారు నల్లధనంపై ఉక్కుపాదంతో దీర్ఘకాలంలో ప్రయోజనాలు స్వచ్ఛత దిశగా దేశం అడుగులు వేస్తోంది సమాజంలోని చెడు జీవితంలో భాగమైపోయిందనుకుంటున్నారు అవినీతిపై పోరాటం చేయడానికి దేశ ప్రజలు అవకాశం కోసం ఎదురు చూశారుపెద్దనోట్ల రద్దు స్వచ్ఛ కార్యక్రమంనగదు రద్దుతో నిజాయితీపరులు కూడా కాస్త కష్టపడ్డారు సత్యం అన్నది భారతీయులకు ముఖ్యమైనది దేశప్రజలు సత్యాన్ని, నిజాయితీని నిరూపించుకున్నారు నవంబర్ 8 నుంచి ప్రజలు చెడుపై పోరాడుతున్నారు ప్రజల కష్టాలు దేశ భవిష్యత్ కు ప్రతీక