ఏ సవాల్ అయినా ఎదుర్కొంటున్నాం ..మోడీ

  modi said we can fight any war

మహనీయుల త్యాగఫలం వల్లే స్వాతంత్య్రం వచ్చిందన్నారు. 70వ స్వాతంత్య్రం దినోత్సవం వేళ దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు సంకల్పించుకుందామని పిలుపునిచ్చారు.మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్రం వెనుక లక్షలాది మహా పురుషుల త్యాగం దాగి ఉందన్నారు. ముక్కలుగా ఉన్న దేశాన్ని సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఏకం చేశారని గుర్తు చేశారు. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, అందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడమే  దేశ ప్రజల సంకల్పం కావాలని సూచించారు. సురాజ్యం ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరి అని చెప్పారు.

సురాజ్యం ఏర్పాటుకు మన నిరంతర సంకల్పం కావాలన్నారు. సురాజ్యం కల సాకారం ఇంకా ఆలస్యం చేయరాదు అని సూచించారు.భారతదేశానికి వేలాది ఏళ్ల చరిత్ర ఉందని గుర్తు చేశారు. భారత్ సంస్కృతీ, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. దేశం ముందు అనేక సవాళ్లున్నాయి, వాటిని ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పడం ప్రారంభిస్తే సమయం సరిపోదన్నారు.ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఇతర పార్టీల నేతలు, విద్యార్థులు హాజరయ్యారు. ప్రధానిగా మూడోసారి ఎర్రకోటపై మోడీ ప్రసంగించారు. రాజ్‌ఘాట్‌లో భారత జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. సమాధి వద్ద పుష్పాంజలి ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు

SHARE