బడ్జెట్ ప్రవేశ పెట్టే విధానాలకు సంబంధించి nda సర్కార్ భారీ మార్పులకి సిద్ధమైంది.ఇప్పటిదాకా ఫిబ్రవరి లో ప్రవేశపేట్టే సాంప్రదాయాన్ని మారుస్తూ జనవరిలోనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది.బడ్జెట్ ని నెలముందే పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ఆలోచిస్తోంది. కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలయ్యే లోపే బడ్జెట్ ఆమోదం కూడా జరిగిపోయేలా ప్లాన్ చేస్తోంది.
సాధారణంగా బడ్జెట్ ని ఫిబ్రవరి నెల చివరి పనిదినం రోజు ప్రవేశపెట్టడం ఏళ్ల తరబడి వస్తున్న ఆనవాయితీ.అయితే మోడీ సర్కార్ జనవరి చివరలోనే ఈ ప్రక్రియ పూర్తిచేయాలని కృతనిశ్చయంతో వుంది.ఇక 92 సంవత్సరాలుగా విడిగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ ని కూడా ప్రధాన బడ్జెట్లో భాగం చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.