ఆంధ్రాకి ప్రత్యేకం ఖాయం ..హోదా చెప్పలేం?

   Modi sarkar thinking give ap special state but no giving special status ap
విభజన తరువాత ఆంధ్రాకి షాకులు మీద షాకులు ఇస్తున్న కేంద్రం ఎట్టకేలకి ఓ వరం ఇవ్వబోతోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ మొదలుకొని నిన్నమొన్నటి పవన్ సభ దాకా పరిణామాల్ని పరిశీలించిన బీజేపీ హైకమాండ్ కి ఓ విషయం కాస్త ఆలస్యంగా అర్ధమైంది.ప్రత్యేక హోదా డిమాండ్ వల్ల వస్తున్న ఒత్తిడి కన్నా ఇచ్చిన మాట కమలం నిలబెట్టుకోదని సాగుతున్న ప్రచారం పార్టీకి మంచిది కాదని ఢిల్లీ పెద్దలు గుర్తించారట.rss లో పట్టున కొందరు నేతల మాట విని ఇప్పటికే తప్పు చేశామని అభిప్రాయానికి వచ్చారట.మిగతా రాష్ట్రాల నుంచి కొన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకి కట్టుబడితేనే రాజకీయంగా కొత్త మిత్రులు జత కలుస్తారని కూడా కమలదళం ఫైనల్ నిర్ణయానికి వచ్చిందంట.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ,ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తో వెంకయ్యనాయుడు ,సుజనా చౌదరి మధ్య జరిగిన చర్చల్లో బీజేపీ అభిప్ర్రాయం దాదాపు క్లియర్ అయ్యిందట.అయితే కేవలం హోదా ప్రకటన వల్ల వచ్చే ప్రయోజనం మాత్రమే ఆంధ్ర అభివృద్ధికి సరిపోదని వెంకయ్య ,సుజనా బలంగా వాదించారట.మేము చెప్పేది కూడా అదేనని,ప్యాకేజ్ కి అంగీకరించాలని అరుణ్ జైట్లీ సూచించారట.సుజనా వెంటనే ఆంధ్రాలో నెలకొన్న రాజకీయ పరిణామాలు వివరించి సెంటి మెంట్ గా మారిన హోదా డిమాండ్ నెరవేర్చకపోతే రెండు పార్టీలకి జరిగే నష్టాన్ని తెలియజెప్పారట.సుజనా వాదనతో ఏకీభవించిన అమిత్ షా ఆంధ్రాకి మేలు చేసే విషయంలో ఇక వెనకడుగు తగదని జైట్లీకి చెప్పినట్టు తెలుస్తోంది.

సాంకేతిక అంశాలు ,హోదాతో జరిగే మేలు పరిమితం అన్న అంశాల్ని దృష్టిలో ఉంచుకొని ఓ ప్రత్యేక ఫార్ములా రూపొందించడానికి కేంద్ర పెద్దలు డిసైడ్ అయినట్టేనని సమాచారం.ఆ కొత్త ఫార్ములా ప్రకారం ఆంధ్రాకి హోదా వల్ల వచ్చే అన్ని వెసులుబాట్లు కల్పిస్తారు.దాంతో పాటు ప్యాకేజ్ రూపంలో కొంత ఆర్ధిక సాయం కూడా చేస్తారు.ఇందుకోసం 10 ఏళ్ళ కాలపరిమితి విధించే అవకాశముంది.ఒక్క హోదా అన్న మాట తప్ప ఆంధ్రా ప్రత్యేకం అని చెప్పేలా ఫార్ములా ఉంటుంది.అప్పటికీ హోదా డిమాండ్ రాజకీయాలు నడిస్తే ఎలా అన్న సందేహం కూడా వుంది.ఆ కోణం లో కూడా ఆలోచించి మోడీ సూచనలకు తగినట్టు తుది నిర్ణయం ప్రకటిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here