శశికళకి మోడీ షాక్ …ఇదిగో ఎవిడెన్స్

Posted December 26, 2016

modi shock to sashikala
తమిళనాట జరుగుతున్న అధికార రేసులో కేంద్రం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది.శశికళ వర్గం సీఎం పీఠాన్ని అందుకోడానికి వేస్తున్న ఎత్తుల్ని అడ్డుకోడానికి కేంద్రం పావులు కదుపుతోంది.ఓ విధంగా చెప్పాలంటే సీఎం పన్నీర్ సెల్వం కి అండగా …శశికి వ్యతిరేకంగా అడుగులేయడానికి ప్రధాని మోడీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నెల 29 న జరగబోయే అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం కీలకం కావడంతో అంత కన్నా ముందే కేంద్ర వైఖరి తేటతెల్లమయ్యే సంకేతం ఎవిడెన్స్ కనిపించింది.

జయ మరణం తర్వాత పోయెస్ గార్డెన్ కి వచ్చి చిన్నమ్మ శశికళ దర్శనం చేసుకునే నాయకులకి కొదవలేదు.తామేమీ తక్కువ తినలేదంటూ శశి ప్రాపకం కోసం వివిధ విశ్వవిద్యాలయాల వీసీ లు కూడా చిన్నమ్మని కలిసి వచ్చారు.ఓ విధంగా ఆమెకి సంఘీభావం ప్రకటించారు.దీనిపై డీఎంకే నేత స్టాలిన్ తీవ్ర అభ్యంతరం చెప్పినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.అయితే హఠాత్తుగా ఇప్పుడు రాజభవన్ స్పందించింది.శశిని కలవడం తప్పంటూ రాజ్ భవన్ సదరు వీసీ లకి తాఖీదులిచ్చింది. ఇంతకన్నా ఏమి ఎవిడెన్స్ కావాలి శశికళకి మోడీ షాక్ ఇస్తారనడానికి?

SHARE