మై హూనా అంటున్న మోడీ!!

Posted December 27, 2016

modi statement i am hereతమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు చీమ కుట్టినా సహించేది లేదంటున్నారు ప్రధాని మోడీ. ముఖ్యంగా సెల్వంకు చిన్న ఇబ్బంది తలెత్తినా పరిణామాలు వేరే రకంగా ఉంటాయని చిన్నమ్మ వర్గానికి మోడీ నుంచి గట్టి వార్నింగ్ వెళ్లిందట. ఇటీవల ఢిల్లీ వెళ్లిన పన్నీర్ సెల్వం… అన్నాడీఎంకేలో జరుగుతున్న అప్ డేట్స్ తో పాటు మన్నార్గుడి మాఫియా కథలను కూడా పూసగుచ్చినట్టు వివరించారట. సెల్వం ఢిల్లీ నుంచి వచ్చాక… స్థానిక బీజేపీ నాయకులతోనూ రిపోర్ట్స్ తెప్పించుకున్నారట ప్రధాని. అన్నింట్లోనూ పన్నీర్ సెల్వం వైపు చిన్న తప్పు కూడా లేదని తేలిందట. దీంతో మోడీ ఇక తమిళనాడు ముఖ్యమంత్రికి అన్ని విధాల అండగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

ప్రధాని మోడీ.. పన్నీర్ సెల్వంకు ఫుల్ భరోసా ఇచ్చారట. తెగే దాకా లాగితే శశికళకే కష్టమని చెప్పుకొచ్చారట. అప్పటిదాకా ఏం చేసినా ఓపిక‌గా ఉండాలని సెల్వంకు సలహా ఇచ్చారట పీఎం. ఫుల్ టైమ్ సీఎం మీరేనని కూడా అభయం ఇచ్చారని టాక్.

ఇప్పుడైతే ఓకే గానీ… శశికళ పార్టీని చీలిస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అంటే.. దానికి విరుగుడు ఆలోచిస్తున్నారట ఢిల్లీ పెద్దలు. అవసరమైతే శశికళ వర్గాన్ని పక్కనబెట్టి.. సెల్వం వర్గాన్ని బీజేపీలో కలుపుకునేందుకు కూడా వెనుకాడబోమని చెన్నైకి సిగ్నల్స్ వెళ్లాయని చెబుతున్నారు. అంతదాకా వస్తే బీజేపీతో కలిసి పోయేందుకు సెల్వం సారు కూడా రెడీగా ఉన్నారట.

అటు ఇవన్నీ గమనించింది కాబట్టి చిన్నమ్మ కూడా ఇక జాగ్రత్తగా అడుగులు వేస్తోందని సమాచారం. ఈనెల 29న జ‌రగ‌నున్న మీటింగ్ లోనూ సంయ‌మ‌నం పాటించాల‌ని డిసైడ్ అయ్యింద‌ని టాక్. ఢిల్లీకి ఎదురెళ్లితే గూబ గుయ్ అనడం ఖాయమని.. అందుకే దూకుడు తగ్గించుకోవాలనే నిర్ణయానికి శశికళ వచ్చిందట‌. అయితే చిన్నమ్మ స్ట్రాటజీ వర్కువుట్ అయ్యేది కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఢిల్లీ నుంచి ఇంత ఔట్ అంట్ ఔట్ గా సెల్వంకు సపోర్ట్ ఉండగా శశి.. ఏం చేసినా లాభం లేదని సూచిస్తున్నారు.

SHARE