కేంద్రం చేతిలో “మన్నార్గుడి” జాతకం !!

0
428
modi taking to full details of sasikala mannargudi mafia

Posted [relativedate]

modi taking to full details of sasikala mannargudi mafia
మన్నార్గుడి మాఫియాపై కేంద్రం ఓ కన్నేసిందా? శశికళ అండ్ టీమ్ కు ఇక కష్టకాలమేనా? అంటే ఔననే అనిపిస్తోంది. ఇటీవల టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరగడం అందులో భాగంగానే జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఐటీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయిన శేఖర్ రెడ్డి వేలూరు జిల్లా కాట్పాడికి సమీపంలోని తొండ్ర తులసి అనే గ్రామవాసి. జయలలిత స్నేహితురాలు శశికళతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుకు అత్యంత సన్నిహితుడు. మన్నార్గుడి బ్యాచ్ లో ఇతను కూడా ఒకడని చెబుతున్నారు. అందుకే ఆయన తమిళనాడు ప్రభుత్వం నుంచి సుమారు వెయ్యి కోట్ల కాంట్రాక్టులు దక్కాయట. అన్నాడీఎంకే పెద్దల సిఫార్సుతోనే చంద్రబాబు.. ఆయనను టీటీడీ బోర్డు మెంబర్ గా ఎంపిక చేసినట్టు చెబుతున్నారు.

మన్నార్గుడి బ్యాచ్ కు ఝలక్ ఇచ్చేందుకే శేఖర్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయని తెలుస్తోంది. ఇది జస్ట్ శాంపిలేనని చెబుతున్నారు. మన్నార్గుడి మాఫియా ఏమాత్రం తోకజాడించినా .. వారికి తగిన శాస్తి చేసేందుకు కేంద్రం స్కెచ్చేసిందట. ఇప్పటికైనా కంట్రోల్ లో ఉండాలని సంకేతాలిచ్చిందట. ఇక శశి బ్యాచ్ కు కష్టకాలం మొదలైందని ప్రచారం జరుగుతోంది. ఈ మాఫియా ఎక్కడికి వెళ్తోంది? ఏం చేస్తోంది? ఇప్పటిదాకా ఎంత వెనకేశారు? ఇలాంటి వాటిపై ఇప్పటికే మోడీ టీమ్ వివరాలు సేకరించిందట. ప్రతి ఒక్కరి జాతకం ఇప్పుడు కేంద్రం పెద్దల చేతిలో ఉందని సమాచారం. అందుకే జాగ్రత్తగా ఉండాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట ఢిల్లీ పెద్దలు.

Leave a Reply