మహిళా శక్తిని టార్గెట్ చేసిన మోడీ!!

0
276
modi target on women force

Posted [relativedate]

modi target on women force
రాజకీయాల్లో మహిళా శక్తి చాలా తక్కువ. మన దేశంలో అయితే పాపులర్ విమెన్ లీడర్లను వేళ్ల మీద లెక్కపెట్టేయొచ్చు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండేది సోనియా, సుష్మా, మమతా బెనర్జీ, మాయావతి, జయలలిత లేదు కనుక ఆ ప్లేసులో శశికళను చేర్చుకోవచ్చు. సోనియాగాంధీ.. జాతీయపార్టీ కాంగ్రెస్ కు చెందిన వ్యక్తి. సుష్మా స్వరాజ్ బీజేపీ లో ఉన్నారు. ఈ ఇద్దరిని పక్కనబెడితే ప్రాంతీయ పార్టీలకు చెందిన బలమైన మహిళా నాయకులను టార్గెట్ చేశారు మోడీ.

నోట్ల రద్దు అంశంలో మమతా బెనర్జీ.. మోడీని విమర్శిస్తున్నారు. ఇతర రాజకీయ పార్టీలను ఒక వేదికపైకి తెచ్చి కేంద్రంతో ఢీ కొడుతున్నారు. దీంతో ఢిల్లీ పెద్దలు కూడా తృణమూల్ కాంగ్రెస్ ను ఇబ్బంది పెడుతున్నారని టాక్. ముఖ్యంగా శారదా స్కాంను తెరపైకి తెచ్చి బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మిథున్ చక్రవర్తి రాజీనామా అందులో భాగంగానే జరిగిందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక ముందు కూడా ఇలాంటి పరిణామాలు కోల్ కతాలో చాలానే జరిగే అవకాశముందట.

అటు యూపీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అక్కడ బలమైన రాజకీయ పార్టీగా ఉన్న బీఎస్పీని టార్గెట్ చేశారు ఢిల్లీ పెద్దలు. మాయావతిని లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి ఆమె కూడా చాలా స్ట్రాంగ్ గా స్పందించడంతో రాజకీయం వేడెక్కింది. తాజాగా ఢిల్లీలోని బీఎస్పీ ఆఫీసులో ఐటీ దాడులు జరిగాయి. బీఎస్పీకి చెందిన బ్యాంకు ఖాతాలో కేవలం 45 రోజుల్లో ఏకంగా 107 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. దీంతో ఈ డిపాజిట్లపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై నోయిడాలోని కొంతమంది బిల్డర్లకు నోటీసులు వెళ్లాయట. ఐటీతోబాటు ఈడీ కూడా ఈ డిపాజిట్లపై దర్యాప్తు మొదలెట్టింది. మాయావతి సోదరుడు ఆనంద్‌కుమార్‌కు, ఈ బిల్డర్లకు మధ్య లావాదేవీలు జరిగినట్టు సమాచారం. దీంతో మాయావతి కూడా బీజేపీపై కొంచెం దూకుడు తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నారని చెబుతున్నారు.

ఇక తమిళనాడులో జయలలిత బతికుండగా.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకునే ధైర్యం చేయని బీజేపీ ఇప్పుడు తరచూ అన్నాడీఎంకే నాయకులతో భేటీ అవుతోంది. పన్నీర్ సెల్వం ను నడిపించేది అంతా ఢిల్లీ పెద్దలేనని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదంతా చిన్నమ్మ శశికళను తొక్కేయడానికే జరుగుతోందన్న వాదన ఉంది. రామ్మోహన్ రావు తొలగింపు, శేఖర్ రెడ్డి అరెస్ట్, పన్నీర్ సెల్వం ఢిల్లీ టూర్ .. ఇవన్నీ అందులో భాగంగానే జరిగాయట. దీంతో చిన్నమ్మ కూడా సీన్ అర్థమైంది. ఢిల్లీతో ఢీ కొట్టకుండా కొన్ని రోజుల వరకు సైలెంట్ గానే ఉండాలని నిర్ణయించుకుందట ఆమె.

మొత్తానికి మూడు రాష్ట్రాల్లో ముగ్గురు బలమైన మహిళా నాయకులను బీజేపీ ఇరుకున పెడుతోంది. ఇదంతా మోడీ స్కెచ్ లో భాగంగానే జరుగుతోందన్న ఊహాగానాలొస్తున్నాయి. ఎందుకంటే ఆ మూడురాష్ట్రాల్లోనూ బీజేపీ పాగా వేయాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతానికి మోడీ హవా నడుస్తోంది కాబట్టి ఓకే గానీ… కొంతకాలం తర్వాత ఈ ముగ్గురు మహిళా మణులను వెనక్కి నెట్టడం అంత ఈజీ కాదంటున్నారు పరిశీలకులు.

Leave a Reply