Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నవంబర్ నుంచి జనవరి వరకు చేతిలో డబ్బుల్లేక దేశంలో జనమంతా అల్లాడిపోయారు. బతకడానికి డబ్బు ఎంత అవసరమే చాలా మందికి తెలిసొచ్చింది. డీమానిటేజేషన్ పుణ్యమా అని అన్ని అభివృద్ధి సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. అయినా మోడీ దిగిరాలేదు. పైగా మరోసారి దేశానికి షాకివ్వాలని నిర్ణయించుకున్నారు. బ్లాక్ మనీ పూర్తిస్థాయిలో జమ కాలేదనే కారణం చెబుతూ.. రెండు వేల నోట్లు, నాణాల రద్దుకు మోడీ సిద్ధమౌతున్నారట.
నిజానికి రెండు వేల రూపాయల నోట్ల రద్దుపై ముందుగానే జనం అంచనాలు వేసుకున్నా.. వెంటవెంటనే షాకులెందుకు.. స్లో పాయిజన్ ఎక్కిద్దామని డిసైడైన మోడీ.. అప్పటికి కామ్ గానే ఉన్నారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా ఇప్పుడు మరోసారి అలాంటి పనికి తెరతీయబోతున్నారట. రెండు వేల నోట్లు రద్దు చేస్తే.. దెబ్బకు బడాబాబుల దెయ్యం వదులుతుందని కొందరు సలహాలు ఇచ్చారట. ఇది బాగానే ఉన్నా నాణాలపై పడటమెందుకని బిచ్చగాళ్లు బెంబేలెత్తుతున్నారు.
రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల నాణాల ముద్రణకు చాలా ఖర్చవుతుందట. ఈ ఖర్చు తగ్గించుకోవడానికి, దీన్ని కూడా బ్లాక్ మనీ గాటన కట్టేయాలని మోడీ డిసైడయ్యారు. ఇప్పటికే నోట్ల రద్దుతో ఆగ్రహంగా ఉన్న జనం.. ఇప్పుడు మళ్లీ ఆ పనిచేస్తే భరిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. చూడాలి.. ఈసారి మోడీ ఎలాంటి చాణక్యాన్ని ప్రదర్శిస్తారో.