Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాట ఆట వీజీ కాదని బీజేపీకి ఎట్టకేలకు బోధపడింది. మొదట పన్నీర్ సెల్వాన్ని దువ్వినా, తర్వాత శశికళను బెదిరించినా, కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామిని మచ్చిక చేసుకున్నా కమలనాథులు ఏమీ చేయలేకపోయారు. పట్టుమని పది మంది మాటవినే ఎమ్మెల్యేలు లేరు. అదే దినకరన్ మాత్రం జైలు నుంచి విడుదలైన గంటల వ్యవధిలో అరవై మందిని తన ఇంటికి రప్పించుకోవడం కేంద్రానికి మింగుడుపడటం లేదు.
ఉత్తరాది రాజకీయాల్లా చక్రాలు తిప్పడం సాధ్యం కాదని తేలడంతో.. కొత్త పథకానికి పదును పెడుతోంది బీజేపీ. రాష్ట్రపతి ఎన్నికల ముగిసేదాకా అన్నాడీఎంకేను కరేపాకులా వాడుకోవాలని ఆ తర్వాత పడేయాలని నిర్ణయానికొచ్చింది. ఒక్కసారి తమ అభ్యర్థి రాష్ట్రపతిగా నెగ్గగానే.. తమిళనాడులో ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని డిసైడైంది.
ఇంత జరిగినా ఇంకా దింపుడు కళ్లెం ఆశ చావలేదు. అందుకే సూపర్ స్టార్ రజినీకాంత్ ను దువ్వుతోంది కమలం. కానీ ఆయన మాత్రం చాలా ఆలోచిస్తున్నారు. బీజేపీ తురుపుముక్కగా పేరొస్తే… తనకు పాపులారిటీ తగ్గుతుందని లెక్కలేసుకుంటున్నారు. ఇప్పటికే తమిళేతరుడన్న విమర్శలకు తోడు… ఢిల్లీ తొత్తు అనే ఆరోపణలు వస్తాయని ఆచితూచి వ్యవహరిస్తున్నారు రజనీ.