యశోద పేరు …పతుల గుణం మారు..మోడీని చూడు ..

 modi wife jashodaben modi become prime ministerపేరులో ఏముంది గుణం మంచిది కావాలిగానీ….పెళ్ళిచూపులప్పుడు యువతీయువకులకు పెద్దోళ్ళు సర్వసాధారణంగా చెప్పే మాట.కానీ పేరులో కూడా ఏదో ఉందనిపిస్తుంది కొన్ని జీవితాల్ని పరిశీలిస్తే…అయితే ఆ సంఘటనల్ని పేరుతో ముడిపెట్టడం మా ఉద్దేశం కాదు .కానీ కాకతాళీయంగా జరిగే కొన్ని విషయాల్ని పట్టి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.ఆలా మా దృష్టికి వచ్చిన వాటిలో ఒకటి ఈ యశోద పేరు..భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా మరో మెట్టు ఎక్కించిన గౌతమ బుద్ధుడు,జైన తీర్ధంకరుడు మహావీరుడు,ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న మోడీ ఈ ముగ్గురు భార్యలపేర్లు యశోద తో ముడి పడ్డవే.దాంతో పాటు మరికొన్ని విషయాల్లో సారూప్యాలు,భేదాలు కూడా కనిపిస్తున్నాయి.అవేమిటో చూద్దాం !

 Goutama Buddha,mahaveera

బుద్ధుడు పెళ్లిచేసుకున్నప్పుడు ఆయన వయసు కేవలం 16.అయన పెళ్లాడిన యశోధర వయసు కూడా 16.మహావీరుడు కూడా చిన్న వయసులోనే యశోదని వివాహం చేసుకున్నాడు. బుద్దుడుకి కొడుకు రాహులుడు పుట్టాక ,మహావీరుడికి కూతురు ప్రియదర్శన పుట్టాక సన్యాసం స్వీకరించారు.29 ఏళ్ల వయసులో బుద్ధుడు,30 ఏళ్ల వయసులో మహావీరుడు జీవిత అర్ధాన్ని,పరమార్ధాన్ని వెదుక్కుంటూ ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టారు .ప్రపంచానికి సరికొత్త ఆధ్యాత్మిక విషయాలు చెప్పగలిగారు.ఇద్దరూ రాజకుటుంబాల్లో పుట్టి భోగభాగ్యాలతో విసుగుపుట్టి …స్వీయ సాధన ,శోధనతో తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుని ..జీవితాన్ని ప్రపంచానికి సరికొత్తగా ఆవిష్కరించారు.

ప్రధాని మోడీ కూడా ఓ విధంగా బాల్యవివాహమే చేసుకున్నారు.పెళ్లినాటికి ఆయన వయసు 18,పెళ్లికూతురు యశోదా బెన్ వయసు 16 .ఆ తర్వాత ఓ మూడు నెలల కాపురం చేసిన మోడీ సన్యాసం తీసుకుంటానని హిమాలయాలకు వెళ్లారు.అక్కడ ఏమైందో ఏమో గానీ మూడేళ్ళ తర్వాత ఇంటికొచ్చారు.భార్యాభర్తలిద్దర్నీ కలపాలని పెద్దలు ప్రయత్నించినా మోడీ ఒప్పుకోలేదు.ముందు వ్యాపారం చేసుకుంటున్న మామ దగ్గరికి ..ఆ తర్వాత పూర్తిస్థాయిలో ప్రజాజీవితానికి సిద్ధపడ్డారు.పుట్టింట్లోనే ఉన్న యశోద చదువు పూర్తిచేసి ఉపాధ్యాయురాలిగా స్థిరపడ్డారు.పదవీ విరమణ తర్వాత కూడా తమ్ముడి కుటుంబంతోనే వుంటున్నారు.

రాజకీయ జీవితంలోకి వచ్చాక మోడీ ఎదుగుదల అందరికీ తెలిసిందే.బుద్ధుడు,మహావీరుడు రాజకుటుంబాల నుంచి సన్యాసం వైపు మొగ్గితే ….సామాన్య కుటుంబంలో పుట్టిన మోడీ…ముందు సన్యాసం వైపు తర్వాత పాలనాపగ్గాలు వైపు వెళ్లారు.బుద్ధుడు,మహావీరుడు అహింస గురించి బోధనలు చేస్తే ..మోడీ రాజకీయ జీవితంపై గోద్రా మరకాలున్నాయి.ఏదేమైనా యశోద పేరున్న అమ్మాయిల్ని పెళ్లాడిన ఈ ముగ్గురు తమ భార్యలకు పెళ్లినాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు.కానీ తాము ఎంచుకున్న బాటలో అద్భుతాలు సృష్టించారు .

SHARE