మోడీ మాట విన్న ఈనాడు..జ్యోతి చెప్పింది చేస్తున్న బాబు?

 Posted October 31, 2016

modi word eenadu follow andhrajyothi word chandrababu follow
సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తాకథనాలు ఆసక్తికరంగా వున్నాయి.దీపావళి సెలవు గుర్తుంచుకుని ఓ రోజు ముందుగానే ఉక్కుమనిషికి ఆ స్థాయిలో ప్రాధాన్యం కల్పించడంయాదృచ్చికం కాదు అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.మోడీ మాటని గౌరవించే సర్దార్ కి ఈనాడు ఆ స్థాయి ప్రచారం కల్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.లెఫ్ట్ భావజాలం నుంచి మొదలైన రామోజీ ప్రస్థానం రైట్ లో వెళుతోందన్న విమర్శలు వస్తున్నాయి.ఆ విమర్శలు పూర్తి కాకముందే …వాటిని నిజం చేస్తూ కేంద్రమంత్రి దత్తాత్రేయ సర్దార్ లేకపోతే నైజాం మరో కాశ్మీర్ అయ్యేదన్నారు.దీంతో విమర్శలు మరింత పదునెక్కాయి.మోడీ మాటని ఈనాడు చాప కింద నీరులా అమలు చేస్తోందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.ఆ విధంగా మోడీ మాట చెల్లుబాటు అవుతుంటే ..ఏపీ లో చంద్రబాబు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట పాటిస్తున్నట్టుంది.

ఆర్కే కొత్తపలుకు లో సుదీర్ఘ టెలి,వీడియో కాన్ఫరెన్స్ గురించి రాధాకృష్ణ విమర్శించారు.బాబు కి రాజకీయ దృష్టి తక్కువైందన్నారు.వెంటనే రోజువారీ టెలీకాన్ఫెరెన్స్ లు ఇకపై 15 రోజులకి ఓ సారి నిర్వహిస్తామని బాబు చెప్పేసారు.నీరు ప్రగతి టెలీకాన్ఫెరెన్స్ లో ఇవాళ ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు.పార్టీ నేతలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీ ల కోసం ఇక రోజు 2,3 గంటలు కేటాయిస్తానని బాబు తెలిపారు.ఈనాడు మాట విన్న బాబు ఇప్పుడు ఆంధ్రజ్యోతి మాట కూడా పాటిస్తున్నారు.ఈనాడు మాత్రం మోడీ మాటని గౌరవిస్తోంది..ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరి వెనుక వున్నారో ?

SHARE