Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియామకం వివాదానికి ఇంకా ఫుల్స్టాప్ పడటం లేదు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఇరకాటంలో పడుతున్నారు. టీడీపీ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్లో బాబుకు ఊహించనిమద్దతు దక్కింది. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఏపీ సీఎం నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని స్వాగతించిన మోహన్ బాబు ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.
విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ వెంకన్న బాబు దేవుడని అలాంటి దేవుడిని ఒక ప్రాంతానికో ఒక భాషకో మాత్రమే పరిమితం చేయడాన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. తెలుగు భాష రాకపోవడం ఒక్కటే పెద్ద సమస్య అని తాను అనుకోవట్లేదని మోహన్ బాబు చెప్పారు. కాగా సింఘాల్ నియామకంపై పవన్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. టీటీడీ ఈవోగా ఉత్తారాదికి చెందిన సింఘాల్ నియామకాన్ని నేను వ్యతిరేకించడం లేదు కాని ఉత్తరాదిలోని అమర్ నాథ్ వారణాసి మధురలోని ఆలయాలలో దకిణాది ఐఏఎస్ లకు ఈఓ లుగా అనుమతినిస్తారా అని పవన్ నిలదీశారు.
దీనికి చంద్రబాబు సమాధానం చెప్పి తీరాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే పవన్ ట్వీట్ ని టీటీడీ నేతలు తప్పు పట్టారు. ఐఏఎస్ లకు కులం మతం ప్రాంతం వంటివి ఉండవని వారు అన్నారు. ఇదిలా ఉంటే విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని వ్యతిరేకించారు.