దేశంలోకి మోహన్ బాబు ?

  mohan babu join tdp party
అవకాశం దొరికినప్పుడల్లా పాతమిత్రుడు చంద్రబాబు మీద సెటైర్లు పేల్చే డైలాగ్ కింగ్ మోహన్ బాబు మనసు మారిందా? అయన తెలుగుదేశం వైపు చూస్తున్నారా? ఈ ప్రశ్నలకి ఔననే సమాధానం ఇస్తున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు.మోహన్ బాబు మనసు మారడానికి వాళ్ళు ఒకటిరెండు కారణాలు కూడా చెబుతున్నారు.తాను గానీ,కుమార్తె లక్ష్మి గానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని మోహన్ బాబు ఆలోచనట.ముందు పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ ఈ విషయం చెప్పేసరికి అంతంత మాత్రపు స్పందనే చూపించింది.దీంతో మోహన్ బాబు హర్ట్ అయ్యారని తెలుస్తోంది.

అదే సమయంలో దేవినేని నెహ్రు స్నేహం కొద్దీ వైసీపీ లోకి వెళ్ళొద్దని మోహన్ బాబుకి సలహా ఇచ్చారట.తనతోను వైసీపీ అధిష్టానం,దూతలు వ్యవహరించిన తీరు సవ్యంగా లేదని నెహ్రు చెప్పడంతో మోహన్ బాబు పునరాలోచనలో పడ్డారట.అదే టైములో బాలకృష్ణ,లోకేష్ స్వయంగా సానుకూల సంకేతాలు పంపడంతో దేశం వైపు మొగ్గాలని మోహన్ బాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.ఆ నిర్ణయం తీసుకున్నాక ఇటీవల లక్ష్మి తో కలిసి హైదరాబాద్ లో చంద్రబాబుని కలిసిన మోహన్ బాబు తన ఆలోచన చెప్పారట.అయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో అధికారిక ప్రకటన చేయాలని మోహన్ బాబు భావిస్తున్నారట.

SHARE