బాబు తో మోహన్ బాబు..ఎందుకో?

  mohan babu meet cm chandrababu
ఇద్దరు మిత్రులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.వారిలో ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ..మరొకరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.కుమార్తె మంచు లక్ష్మి తో కలిసి లేక్ వ్యూ క్యాంపు కార్యాలయానికి వచ్చిన మోహన్ బాబు ..చంద్రబాబుతో సమావేశమయ్యారు.ఇది మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా కొందరికి మాత్రం ఈ సమావేశం ఆసక్తి రేకెత్తిస్తోంది.అందుకు కారణాలు లేకపోలేదు.

కొన్నాళ్లుగా మోహన్ బాబు రాజకీయాల్లోకి పునః ప్రవేశం చేస్తారని వార్తలు వస్తున్నాయి.ఇటీవల అయన వ్యాఖ్యలు కూడా అందుకు దోహదం చేశాయి.అసెంబ్లీ రౌడీ సినిమా గురించి చెబుతూ పార్టీ మారుతున్న ప్రజాప్రతినిధులపై మోహన్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఆ టైం లో ఏపీ లో వైసీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అధికార పక్షం లో చేరుతున్నారు.దీంతో అయన కామెంట్స్ చర్చకి దారి తీశాయి.కొందరు వైసీపీ ముఖ్యులు అంతర్గత చర్చల్లో మోహన్ బాబు తమ పార్టీలోకి రావడం ఖాయమంటున్నారు.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసిన మోహన్ బాబు ఆయన్ని ఎన్టీఆర్ తో పోల్చి బాబుకి మండేలా చేశారు.ఒక నెల వ్యవధిలోనే టైం తీసుకుని చంద్రబాబుని కలిసేందుకు మోహన్ బాబు రావడం వెనుక ఏముందబ్బా?రాబోయే పరిణామాలు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పక పోవు.

SHARE