మోహన్ బాబు చేతుల మీదగా ఫస్ట్ లుక్

 mohan babu release shekharam gari abbayi movie first lookవిన్ను మద్దిపాటి, అక్షత జంటగా అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం ‘శేఖరంగారి అబ్బాయ్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ప్రముఖ నటుడు కలెక్షన్ కింగ్ డాక్టర్ మంచు మోహన్ బాబు లాంఛ్ చేశారు.

మా బిగినింగ్ డేస్ లో మాలాంటి వారిని దాసరి గారు తప్ప వేరేవరూ ఎంకరేజ్ చేయలెదు. అక్కినేని నాగేశ్వరరావుగారు చెప్పారు నటుడికి ప్రతి రోజు ఓ లెసన్. ఈ చిత్ర దర్శకురాలు అక్షత బహుముహ ప్రజ్ఞాశాలి. హీరో విన్ను చాలా బాగున్నాడని. ఇప్పుడున్న చాలా మంది కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏదో రోజు విజయం మనకు లబిస్తుందన్నారు.

కాశీ విశ్వనాద్ మాట్లాడుతూ “శేఖరంగారి అబ్బాయి మంచి కాన్సెప్ట్. ప్లానింగ్ తో చేశారు. మంచి విజయాన్ని సాధిస్తుందన్నారు.హీరో విన్నుమద్దపాటి మాట్లాడుతూ ” మోహన్ బాబు గారు మా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం మా టీమ్ అదృష్టం. కష్టపడి చేశాం. అందరి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నామని తెలిపారు. హీరోయిన్ అక్షత మాట్లాడుతూ “మోహన్ బాబుగారు మా లాంటి కొత్త వారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.

సినిమా చాలా బాగా వచ్చింది.నటీనటులు, సాంకేతిక నిపుణులందరికి మంచి పేరు తీసుకు వచ్చే చిత్రమిది. టీమ్ అందరు చాలా బాగా సపొర్ట్ చేశారు అన్నారు. నిర్మాత మద్దిపాటి సోమశేఖర రావు మాట్లాడుతూ “టాకీ కంప్లీట్ అయింది. సినిమా చాలా బాగా వచ్చింది త్వరలోనే మోషన్ పోస్టర్ ను, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో సూర్య, అనురూప్ ,డి.ఎం.కె , సంగీత దర్శకుడు సాయి ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు.

SHARE