ఎన్టీఆర్ తర్వాత ఆయనే..బాబుని గిచ్చిన బాబు.

 mohan babu said after ntr Its KCR
ఎన్టీఆర్ ….ఆయనే కాదు ..ఆ పేరే ఓ సంచలనం..ఆయనంత కాకపోయినా ఆ తర్వాత స్థానం దక్కితే చాలని ఇటు సినీ రంగం ..అటు రాజకీయ రంగం లో ఎందరో తాపత్రాయపడతారు.ఇక అయన తర్వాత తెలుగుదేశాన్ని నడిపిస్తున్న చంద్రబాబుకి ఎన్టీఆర్ తర్వాత తన పేరే రావాలని ఆశపడడం సహజం.అయితే పెద్దాయన రాజకీయగ్రంధంలో చివరి పేజీ బాబు వల్ల దెబ్బ తిన్న కారణమో మరేదో కానీ ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు పేరు వినపడలేదు.

ప్రజాకర్షక పధకాల కారణంగా బాబు బద్ధశత్రువు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ని ఎన్టీఆర్ తో పోల్చేవాళ్ళు..దీనికి బాబు చాలాసార్లు నొచ్చుకున్నారు.వై.ఎస్ మరణం తర్వాత కూడా ఆ పోలిక కొన్నాళ్ళు సాగింది.ఇంతలో బాబు పాతమిత్రుడు మోహన్ బాబు….తెర బయట డైలాగ్ తో బాబుని మళ్లీ గిచ్చినంత పనిచేశాడు.ఎన్టీఆర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ ని మించిన నాయకుడు లేడని డైలాగ్ కింగ్ మోహన్ బాబు పొగిడేశారు.వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లిన మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.తన రాజకీయ బద్ధ శత్రువుల్ని ఎన్టీఆర్ తో పోల్చడం బాబుకి ఎంత కష్టంగా ఉంటుందోవేరే చెప్పాలా ?

SHARE