వైసీపీలో చిచ్చు పెట్టిన మోహ‌న్ బాబు?

0
491
mohan babu troubles ycp leaders

Posted [relativedate]

mohan babu troubles ycp leaders
క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు వైసీపీలో చిచ్చు పెట్టార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మోహ‌న్ బాబు వ‌ల్లే జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడైన‌ ఓ మాజీ మంత్రి మాట‌లు ప‌డాల్సి వ‌చ్చింద‌ట‌. ఇంత‌కు ఆ మాజీ మంత్రి ఎవ‌రంటే… పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి.. మోహ‌న్ బాబుకు ఏళ్ల నుంచి ప‌రిచ‌యం ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఆ సంగ‌తి కాసేపు ప‌క్క‌నబెడితే ఈ మ‌ధ్య హైద‌రాబాద్ విమానాశ్ర‌యంలో ఇద్ద‌రూ అనుకోకుండా క‌లుసుకున్నారు. ఇద్ద‌రూ హైద‌రాబాద్ నుంచి తిరుప‌తికి ఒకే ఫ్లైట్ లో బ‌య‌లుదేరారు. గ‌మ్యస్థానాన్ని చేరుకునే క్ర‌మంలో ముచ్చ‌ట్ల‌లో మునిగిపోయారు. అందులో భాగంగానే మోహ‌న్ బాబును వైసీపీలోకి ఆహ్వానించారట పెద్దిరెడ్డి. అయితే ఆయ‌న మాత్రం ఏదీ చెప్ప‌కుండానే దాట‌వేశార‌ట‌. అంతేకాదు వైసీపీ టాపిక్ వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న ముఖంలోనూ ఎలాంటి రియాక్ష‌న్ రాలేద‌ని స‌మాచారం. ఈలోపు తిరుప‌తి రానే వ‌చ్చింది. ఇద్ద‌రూ క‌లిసి తిరుప‌తి విమానాశ్ర‌యం నుంచి బ‌య‌ట‌కు వచ్చి… ఎవ‌రి ప‌ని మీద వారు వెళ్లిపోయారు. అయితే విమానంలో వీరి ప‌క్క‌నే కూర్చున్న బయ‌ట‌కు వ్యక్తుల‌కు ఈ సంభాషణ వినిపించిద‌ని టాక్. దాంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది.

పెద్దిరెడ్డి… మోహ‌న్ బాబును వైసీపీలోకి ఆహ్వానించార‌న్న విష‌యంలో జ‌గ‌న్ చెవిన పడింద‌ట‌. దీంతో ఆయ‌న పెద్దిరెడ్డిపై అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. ఎన్ని చెప్పినా మోహ‌న్ బాబు టీడీపీ మ‌నిషేన‌ని… అలాంటి వ్య‌క్తిని వైసీపీలోకి ఎందుకు ఆహ్వానించార‌ని ప్ర‌శ్నించార‌ట‌. మోహ‌న్ బాబును తాను ఎప్పుడో ఆహ్వానించాన‌ని… అప్పుడే స్పందించ‌ని ఆయ‌న‌… ఇప్పుడు వైసీపీలోకి వ‌స్తార‌ని ఆశించడం అవివేక‌మ‌ని పెద్దిరెడ్డితో చెప్పార‌ట‌. దీంతో జ‌గ‌న్ రియాక్ష‌న్ చూసి పెద్దిరెడ్డి నొచ్చుకున్న‌ట్టు స‌మాచారం.

ఏదో మాట‌ల సంద‌ర్భంలో మోహ‌న్ బాబును వైసీపీలోకి ఆహ్వానిస్తే… ఇంత రాద్ధాంతం అవ‌స‌ర‌మా అని పెద్దిరెడ్డి త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నార‌ట‌. అయితే వైసీపీ క్యాడ‌ర్ మాత్రం ఇదంతా మోహ‌న్ బాబు వ‌ల్లేన‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు. మొత్తానికి క‌లెక్ష‌న్ కింగ్ … తన ప్ర‌మేయం లేకుండానే జ‌గ‌న్ పార్టీలో పెద్ద ర‌చ్చ‌కు కార‌ణ‌మ‌య్యార‌న్న మాట‌.!!!!

Leave a Reply